అంబేద్కర్ ఆశయ సాధనకు కృషి

Mon,April 15, 2019 12:52 AM

తిమ్మాపూర్, నమస్తే తెలంగాణ: భారత రాజ్యాంగ నిర్మాత, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని రాష్ట్ర మంత్రి ఈటల రాజేందర్ పిలుపునిచ్చారు. అంబేద్కర్ 128వ జయంతి సందర్భంగా ఆదివారం మండలంలోని మహాత్మానగర్, అల్గునూర్ చౌరస్తాలో గల అంబేద్కర్ విగ్రహాలకు మంత్రి ఈటల రాజేందర్‌తో పాటు మానకొండూర్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి అంబేద్కర్ ఎనలేని కృషి చేశారనీ, ఆయనను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో కేడీసీసీబీ డైరెక్టర్ కేతిరెడ్డి దేవేందర్‌రెడ్డి, టీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకుడు ఉల్లెంగుల ఏకానందం, వైస్ ఎంపీపీ పొన్నాల భూలక్ష్మి, సర్పంచ్ జక్కని శ్రీవాణి, ఎంపీటీసీ సింగిరెడ్డి స్వామిరెడ్డి, నాయకులు ఇనుకొండ నాగేశ్వర్‌రెడ్డి, మడుపు శ్రీనివాస్‌రెడ్డి, కేతిరెడ్డి అంజిరెడ్డి, మాతంగి లక్ష్మణ్, కేతిరెడ్డి ఎల్లారెడ్డి, చిందం కిష్టయ్య, జాప శ్రీనివాస్‌రెడ్డి, పొన్నాల సంపత్, గూడ కమలాకర్, జక్కని రవీందర్, నేదునూరి గంగరాజం, గవ్వ రవీందర్‌రెడ్డి, గూడ కనకయ్య, కన్నం లక్ష్మణ్‌తో పాటు దళిత సంఘ నాయకులు, ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.

123
Tags

More News

VIRAL NEWS

country oven

LATEST NEWS

Cinema News

Health Articles