కల్యాణం.. కమనీయం

Sun,April 14, 2019 01:54 AM

కరీంనగర్ కల్చరల్: జిల్లా కేంద్రంలోని పలు ఆలయాల్లో శ్రీరామ నవమి సందర్భంగా శనివారం శ్రీ సీతారాముల కల్యాణ వేడుకలను కన్నులపండువగా నిర్వహించారు. రాంనగర్‌లోని మార్క్‌ఫెడ్ ఆవరణలోని శ్రీ వీరాంజనేయస్వామి దేవాలయంలో నిర్వహించిన కల్యాణ వేడుకల్లో కార్పొరేటర్ బోనాల శ్రీకాంత్ దంపతులు పాల్గొన్నారు. అర్చకుడు వేణుగోపాలశర్మ కల్యాణం జరిపించారు. డీఎం శ్యాంసుందర్, డిప్యూటీ మేయర్ రమేశ్, బీర్ల బీరయ్య, శ్రీనివాస్, దేవేందర్, బండి రాజు, శ్రావణ్‌కుమార్, సురిశెట్టి శేఖర్, ఆకుల శ్రీకాంత్, ప్రకాశ్‌రెడ్డి, భక్తులు పాల్గొన్నారు. ప్రకాశం గంజ్‌లోని శ్రీ వరసిద్ధి వినాయక దేవాలయంలో మంగళంపల్లి వేణుగోపాల్‌శర్మ, రత్నాకర్‌శర్మ ఆధ్వర్యంలో కల్యాణం జరిపించారు. మేయర్ రవీందర్‌సింగ్, ఆలయ కమిటీ సభ్యులు, వర్తక సంఘం నాయకులు పాల్గొన్నారు. హరిహరక్షేత్రం రామేశ్వరాలయంలో వేద పండితుడు పురాణం మహేశ్వరశర్మ నేతృత్యంలో ఆలయ పూజారి చౌడుభట్ల రఘురామశర్మ నిర్వహణలో కల్యాణం జరిపించారు. చైర్మన్ దివాకరుని వెంకటేశ్వరశర్మ దంపతులు, ప్రధాన కార్యదర్శి చల్లా మోహన్‌రెడ్డి దంపతులు, భక్తులు పాల్గొన్నారు.

గణేష్ హెల్ప్ హ్యాండ్స్ ఆధ్వర్యంలో భక్తులకు అన్నదానం చేశారు. నాగమల్ల ప్రకాశ్, వేములవాడ ద్రోణాచారి, సత్యనారాయణ, ప్రభాకర్, ఆంజనేయులు, మోహన్‌రెడ్డి, లక్ష్మణ్, తదితరులు పాల్గొన్నారు. భారత్ థియేటర్ రోడ్ వీరాంజనేయ స్వామి ఆలయంలో రాజేంద్రప్రసాద్, నాగరాజుశర్మ, సుధాకర్‌శర్మ కల్యాణాన్ని శాస్ర్తోక్తంగా జరిపించారు. అంజనీపుత్ర సేవాసమితి ఆధ్వర్యంలో అన్నదానం చేశారు. ఈవో పీచర అంజనికిషన్‌రావు, తొడుపునూరి కరుణాకర్ దంపతులు పట్టువస్ర్తాలు సమర్పించారు. కార్పొరేటర్ తాటి ప్రభావతి మనోహర్, ధర్మకర్తలు ప్రభాకర్, కర్ణాకర్, సుగుణాకర్, ఆలయ సిబ్బంది వెంకటాచారి పాల్గొన్నారు. వాసవీ కపుల్స్ క్లబ్ ఆధ్వర్యంలో మజ్జిగ వితరణ చేశారు. అధ్యక్షుడు ఏ నాగరాజు, కార్యదర్శి లక్ష్మణ్, కోశాధికారి గంగాధర్, సతీశ్‌బాబు, తిరుపతి, క్రిష్ణమూర్తి, అన్నపూర్ణ, స్వప్న, భక్తులు పాల్గొన్నారు.

వాసవీ కన్యకా పరమేశ్వరి ఆలయంలో..
అశోక్‌నగర్‌లోని శ్రీ వాసవీ కన్యకాపరమేశ్వరి దేవాలయంలో పారువెళ్ల ఫణిశర్మ కల్యాణాన్ని జరిపించారు. ఆలయ చైర్మన్ చిట్టుమల్ల శ్రీనివాస్ దంపతులు పట్టు వస్ర్తాలను సమర్పించారు. అనంతరం అన్నదానం చేశారు. ప్రధాన కార్యదర్శి కాచం రాజేశ్వర్, కోశాధికారి బొల్లం శ్రీనివాస్, సంకట హర చతుర్థి కన్వీనర్ రాచమల్ల భద్రయ్య, చందా నారాయణ, నల్ల మహేందర్ పాల్గొన్నారు. భాగ్యనగర్ సాయిబాబా ఆలయం వద్ద శ్రీహరిశర్మ, భానుశర్మ ఆధ్వర్యంలో సీతారాముల కల్యాణం జరిపించారు. హోమం నిర్వహించారు. కార్పొరేటర్ అజిత్‌రావు, సదానందచారి, భక్తులు పాల్గొన్నారు. శ్రీమడేలేశ్వర కాశీ విశ్వేశ్వర ఆలయంలో రజక సంఘం, భక్త బృందం ఆధ్వర్యంలో దినేశ్‌శర్మ, ధనుశ్యాంపాండే కల్యాణం జరిపించారు. కాపువాడ చిన్న హనుమాన్ దేవాలయంలో నిర్వాహకుడు ముత్తయ్యగౌడ్ ఆధ్వర్యంలో అర్చకులు కల్యాణోత్సవం నిర్వహించారు. తోట మోహన్, కిషన్, చారి, శ్రీధర్ అధిక సంఖ్యలో పాల్గొన్నారు. గణేష శారదాలయంలో అఖిల బ్రాహ్మణ సమాజం అధ్యక్షుడు నేదునూరి వామన్‌రావు ఆధ్వర్యంలో సీతారామ కల్యాణ మహోత్సవం నిర్వహించారు. అనంతరం మహాతీర్థప్రసాద వితరణ, అన్నదానం చేశారు. కార్యదర్శులు పురం ప్రేమ్‌చందర్‌రావు, రామక విఠల్‌శర్మ, భూమేశ్వర్‌రావు, జీవీ రంగారావు, బండపెల్లి ఉపేందర్‌శర్మ, మధు, శ్రీనివాసరావు, వేణుగోపాల్‌రావు, రాధాకిషన్‌రావు పాల్గొన్నారు.

190
Tags

More News

VIRAL NEWS

country oven

LATEST NEWS

Cinema News

Health Articles