సీతారాముల కల్యాణానికి వేళాయె..

Sun,April 14, 2019 01:54 AM

ఇల్లందకుంట: అపరభద్రాద్రిగా పేరొందిన ఇల్లందకుంట శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయంలో ఆదివారం రాములోరి కల్యాణాన్ని వైభవంగా నిర్వహించనున్నారు. ఇందుకు ఆలయాన్ని విద్యుద్ధీపాలతో అలంకరించారు. సుందరంగా ముస్తాబు చేశారు. కల్యాణ మండపాన్ని రమణీయంగా తీర్చిదిద్దారు. స్వామి వారి కల్యాణాన్ని తిలకించేందుకు జిల్లా నలుమూలల నుంచి సుమారు లక్షకుపైగా భక్తులు తరలివస్తారనే అంచనాతో అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఆలయ ఆవరణలో నీడ కోసం చలువ పందిళ్లు వేయించారు. చలివేంద్రాల్లో తాగునీరు అందుబాటులో ఉంచారు. వాహనాల పార్కింగ్‌కు రెండు ప్రాంతాల్లో స్థలాన్ని చదును చేశారు. అలాగే వైద్య శిబిరాలు, తాత్కాలిక మరుగుదొడ్లను ఏర్పాటు చేశారు. 450 మంది పోలీస్ సిబ్బందితో బందోబస్తు నిర్వహిస్తున్నట్లు ఏసీపీ కృపాకర్ తెలిపారు. జమ్మికుంట రైస్‌మిల్లర్ల ఆధ్వర్యంలో కల్యాణానికి వచ్చే భక్తులకు ఉచిత అన్నదానం చేసేందుకు ఏర్పాట్లు చేశారు. ఆలయం వద్ద జరుగుతున్న ఏర్పాట్లను శనివారం హుజూరాబాద్ ఆర్డీఓ చెన్నయ్య, దేవాలయ ఈవో సుదర్శన్, ఏసీపీ కృపాకర్, జమ్మికుంట, రూరల్ సీఐలు లింగయ్య, సృజన్‌రెడ్డి, ఎస్‌ఐలు నరేశ్, శ్రీనివాస్, జిల్లా రైస్‌మిల్లర్ల సంఘం అధ్యక్షుడు బచ్చు భాస్కర్, పర్యవేక్షించారు.

115
Tags

More News

VIRAL NEWS

country oven

LATEST NEWS

Cinema News

Health Articles