ప్రతి గింజనూ కొనుగోలు చేస్తాం

Sat,April 13, 2019 06:24 AM

-అన్నదాతలకు మద్దతు అందిస్తాం
-నిబంధనల ప్రకారం వరి ధాన్యం తేవాలి
-కేంద్రాల ప్రారంభోత్సవంలో అధికారులు
జమ్మికుంట: కొనుగోలు కేంద్రాల్లోనే రైతులు ధాన్యం విక్రయించాలనీ, ప్రతి గింజనూ కొంటామని జమ్మికుంట వ్యవసాయ మార్కెట్ కార్యదర్శి రెడ్డి నాయక్, పీఏసీఎస్ కార్యదర్శి ప్రకాశ్‌రెడ్డిలు పేర్కొన్నారు. శుక్రవారం పట్టణంలోని పాత వ్యవసాయ మార్కెట్ యార్డులో పీఏసీఎస్ ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేసి, ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. అన్నదాతలకు కొనుగోలు కేంద్రాల్లోనే మద్దతు ధరలు లభిస్తాయన్నారు. నిబంధనల ప్రకారం ధాన్యాన్ని కేంద్రాలకు తీసుకురావాలని సూచించారు. గ్రేడ్-ఏ రకాన్ని రూ.1,770, కామన్ రకాన్ని రూ.1,750లతో కొనుగోలు చేస్తామని చెప్పారు. వరి ధాన్యం విక్రయాలకు తెచ్చే రైతులు తమ పట్టాదార్ పాస్ పుస్తకం, బ్యాంకు ఖాతా జిరాక్స్‌లను అందజేయాలని తెలిపారు. కొనుగోలు చేసిన వారం రోజుల్లోపే బ్యాంకు ఖాతాల్లోకి డబ్బులు జమ చేస్తామని చెప్పారు. తేమ, రాళ్లు, చెత్త, చెదారం లేకుండా చూసుకోవాలన్నారు. దళారులను నమ్మి మోసపోవద్దని సూచించారు. కార్యక్రమంలో అడ్తిదారులు పొనగంటి మల్లయ్య, శ్రీనివాస్‌రెడ్డి, అశోక్, అధికారులు గౌస్, యాకయ్య, లక్ష్మణ్, సిబ్బంది, రైతులు, హమాలీలు, మహిళా కూలీలు, తదితరులు పాల్గొన్నారు.

119
Tags

More News

VIRAL NEWS

country oven

LATEST NEWS

Cinema News

Health Articles