అనుక్షణం అప్రమత్తంగా ఉండాలి

Thu,April 11, 2019 01:18 AM

తిమ్మాపూర్ రూరల్: ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే దాకా అప్రమత్తంగా ఉండాలని ఏసీపీ శివభాస్కర్ సిబ్బందికి సూచించారు. గురువారం ఎన్నికల విధుల్లో పాల్గొనే పోలీ స్, ఇతర రాష్ర్టాల నుండి వచ్చిన బలగాలకు ఎల్‌ఎండీ పోలీస్ స్టేషన్ ఆవరణలో సూచనలు, సలహాలు ఇచ్చారు. పో లింగ్ కేంద్రాల వద్ద పోలీస్ విధులు, బాధ్యతలను వివరించారు. సీఐ కరుణాకర్‌రావు, సదానందం సిబ్బందికి డ్యూటీలు వేసి నిబంధనలు తెలిపారు. ఎస్‌ఐ నరేశ్‌రెడ్డి రూట్ మొబైల్ పోలింగ్ బూత్ సిబ్బందికి డ్యూటీ పత్రాలను అందించా రు. మం డలంలో ఎన్నికలు జరిగే 23గ్రామాల్లో పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా జరిగేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఏసీపీ తెలిపారు.

టీఆర్‌ఎస్‌లో భారీగా చేరికలు
పెగడపల్లి:పెగడపల్లి మండలం ఎల్లాపూర్, కీచులాటపల్లి, రాజరాంపల్లికి చెందిన శ్రీరామ ఆటో యూనియన్ నాయకులు బుధవారం కరీంనగర్‌లోని క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ సమక్షంలో టీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. ఆటో యూనియన్ అధ్యక్షుడు ఇరుగురాల శ్రీనివాస్, సభ్యులు మరుకొండ మల్లారెడ్డి, గొల్లప్లి రాజమౌళి, లింగంపల్లి రాజ్‌కుమార్, ఇస్లావత్ రమేశ్, ఎట్టెం స్వామి, కో ట వెంకటేశం, పర్షరాం తదితరులు మంత్రి సమక్షంలో టీఆర్‌ఎస్ చేరారు. ఇక్కడ నం చర్ల మాజీ సింగిల్‌విండో చైర్మన్ కాసుగంటి రాజేందర్‌రావు, ఎంపీటీసీ పులి రాజేశం, పార్టీ నేతలు రాచకొండ ఆనందం తదితరులు ఉన్నారు.

తిప్పాయపల్లిలో..
కొడిమ్యాల: తిప్పాయపల్లి గ్రామానికి చెందిన బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన యువకులు 100 మంది పూడూర్ సింగిల్ విండో డైరెక్టర్ మ్యాకల మల్లేశం అధ్వర్యంలో బుధవారం టీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. వారికి చొప్పదండి ఎమ్మె ల్యే సుంకె రవిశంకర్ కండువా కప్పి ఆహ్వానించారు. ఇక్కడ సర్పంచ్‌ల ఫోరం మండలాధ్యక్షుడు పునుగోటి కృష్ణారావు,టీఆర్‌ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు మేన్నేని రాజనర్సింగారావు,పార్టీ మండలాధ్యక్షుడు పులి వెంకటేశంగౌడ్, తదితరులున్నారు.

139
Tags

More News

VIRAL NEWS

country oven

LATEST NEWS

Cinema News

Health Articles