డిస్ట్రిబ్యూషన్ సెంటర్‌ను పరిశీలించిన జేసీ

Thu,April 11, 2019 01:18 AM

కరీంనగర్ ప్రతినిధి, నమస్తే తెలంగాణ: లోక్‌సభ ఎన్నికల కోసం స్థానిక ఎస్సారార్ ప్రభుత్వ డిగ్రీ, పీజీ కళాశాలలో ఏర్పాటు చేసిన కరీంనగర్, చొప్పదండి అసెంబ్లీ నియోజకవర్గాల డిస్ట్రిబ్యూషన్, రిసిప్షన్ సెంటర్‌ను జాయింట్ కలెక్టర్ జీవీ శ్యాం ప్రసాద్‌లాల్ బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సెక్టోరల్ అధికారులకు ఒకే రూట్‌లో కేటాయించిన పోలింగ్ కేంద్రాలను తనిఖీ చేసుకోవాలని, ప్రిసైడింగ్ అధికారులకు అందుబాటులో ఉండాలన్నారు. డిస్ట్రిబ్యూషన్ సెంటర్‌లో వీవీప్యాట్‌ల పనితీరు పరిశీలించవద్దని, వాటిని లాక్ చేసి తీసుకెళ్లాలని సిబ్బందికి సూచించారు. పోలింగ్ రోజు ఉదయం 6 గంటలకే మాక్ పోలింగ్ చేసి 50 ఓట్లు పోల్ చేసేలా చూడాలన్నారు. ఓటు వేసేందుకు వచ్చే అంధులకు సహాయకులను అనుమతించాలన్నారు. వీవీప్యాట్ యంత్రంలో సమస్య ఏర్పడితే దానిని మాత్రమే మార్చాలన్నారు.

అలాగే బ్యాలెట్ యూనిట్, కంట్రోల్ యూనిట్‌లో సమస్య వస్తే మాత్రం మొత్తం అన్ని యంత్రాలను మార్చాలన్నారు. అనంతరం సెక్టోరల్ అధికారులు పోలింగ్ సిబ్బంది (ప్రిసైడింగ్, అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులు)కు పోలింగ్ సామగ్రి, ఈవీఎం యంత్రాలు(బ్యాలెట్, కంట్రోల్ యూనిట్లు, వీవీప్యాట్) పోలింగ్ కంపార్ట్‌మెంట్ (ఓటర్లు ఓటు వేసేందుకు ఏర్పాటు చేసే కంపార్టుమెంట్) సామగ్రి అందజేశారు. అధికారులు పోలింగ్ సిబ్బందికి భోజన వసతి సమకూర్చారు. లంచ్ పూర్తి చేసుకున్న పోలింగ్ సిబ్బంది, సెక్టోరల్ అధికారులు కలిసి తమకు కేటాయించిన వాహనాల్లో పోలీసు బందోబస్తుతో సంబంధిత పోలింగ్ కేంద్రాలకు బయల్దేరి వెళ్లారు. ఈ ప్రక్రియను కరీంనగర్ నియోజకవర్గానికి సంబంధించి అసిస్టెంట్ కలెక్టర్ రాజర్షిషా, కరీంనగర్ నియోజకవర్గం రిటర్నింగ్ అధికారి, రెవెన్యూ డివిజనల్ అధికారి ఆనంద్‌కుమార్, చొప్పదండి నియోజకవర్గానికి సంబంధించి జాయింట్ కలెక్టర్ జీవీ శ్యాం ప్రసాద్‌లాల్, చొప్పదండి నియోజకవర్గం రిటర్నింగ్ అధికారి వెంకటేశ్వర్‌రావు, తదితర అధికారులు పర్యవేక్షించారు. సీపీ కమలాసన్‌రెడ్డి పోలీసు బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించారు.

107
Tags

More News

VIRAL NEWS

country oven

LATEST NEWS

Cinema News

Health Articles