ధర్మపురిలోనేడు రథోత్సవం

Tue,March 26, 2019 01:38 AM

ధర్మపురి,నమస్తేతెలంగాణ: 108 దివ్యక్షేత్రాల్లో ఒక్కటైన ధర్మపురి క్షేత్రంలో తొ మ్మిది రోజులుగా స్వామివారి బ్రహ్మోత్సవా లు ఘనంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి దేవాలయంతో పాటు అనుబంధ ఆలయాల్లో భక్తులు స్వామివారలను దర్శించుకున్నారు. ఉత్సవాల్లో భాగంగా మంగళవారం ఉత్సవాల్లో ప్రధాన ఘట్టమైన రథోత్సవం తిలకించేందుకు భక్తుల రాక సోమవారం నుంచే మొదలైంది. క్షేత్రానికి చేరుకున్న భక్తులు గోదావరిలో పుణ్యస్నానాలాచరించి దేవాలయాల్లో స్వామివారలను దర్శించుకున్నారు. శ్రీలక్ష్మినరసింహస్వా మి, శ్రీవేంకటేశ్వరస్వామి, శ్రీరామలింగేశ్వరస్వామివారల రథోత్సవానికి సిబ్బంది ఏర్పాట్లు చేస్తున్నారు. ఉత్సవాల్లో భాగంగా మధ్యాహ్నం 12 గంటలకు పూర్ణాహుతి తదితర పూజలు నిర్వహించిన అనంతరం రథాలపై ఉత్సవ మూర్తులను ఆసీనులను చేసి భక్తుల సందర్శన కోసం ఉంచనున్నారు. అనంతరం 3గంటలకు స్వామివారల రథోత్సవం నిర్వహించనున్నారు.

రథాలను తీసుకొచ్చే దారి దేవస్థానం నుంచి నంది చౌక్ వరకు ఆర్‌అండ్‌బీ అధికారు లు పరిశీలించి చదును చేశా రు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగుకుండా సీఐ లక్ష్మీబాబు ఆధ్వర్యంలో ఎస్‌ఐ శ్రీకాంత్‌తో పాటు దాదాపు 200 మం ది పోలీసు లు బందోబస్తు నిర్వహించనున్నారు. కాగా బ్ర హ్మోత్సవాల్లో భాగంగా ఆలయంలో సాయంత్రం వేళలో యజ్ఙాచార్యులు కందాళై పురుషోత్తమాచార్యుల ఆధ్వర్యంలో నిత్యహోమాలు, బలిహరణపూజా కార్యక్రమాలు నిర్వహించారు. అలాగే ప్రధాన దేవాలయం, అనుబంధ ఆలయాల్లో వేద బ్రాహ్మణులు, ఆలయ అర్చకులు ప్ర త్యేక పూజ లు నిర్వహించారు. రాత్రి 8 గంటలకు దోపోత్స వం కార్యక్రమం నిర్వహించారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా రాత్రి 8.30 నుంచి 10 గంటల వర కూ చక్రపాణి కిరణ్‌కుమార్ దోపుకథ కార్యక్రమం నిర్వహించారు. దీంతోపాటు జగిత్యాల మెదిని లలితకళాక్షేత్రం వారి ఆధ్వర్యంలో నిర్వహించిన నృత్యప్రదర్శన లు అకట్టుకున్నాయి. సోమవారం స్వామివారికి రూ.81,950 ఆదాయం సమకూరినట్లు సిబ్బంది తెలిపారు. వివిధ రకాల టికెట్ల ద్వారా రూ.34,540, ప్రసాదాల ద్వారా రూ.34,700, అన్నదానం ద్వారా 12,710 వచ్చినట్లు తెలిపారు. ఇక్కడ ఆలయ చైర్మన్ ఎల్లాల శ్రీకాంత్‌రెడ్డి, డీసీఈఓ అమరేందర్, ధర్మకర్తలు ఇనుగంటి వెంకటేశ్వర్‌రావు, అక్కనపల్లి సునీల్‌కుమార్, మురికి బాగ్యలక్ష్మి, మామిడి లింగన్న, జెట్టి రాజన్న, సాయిని శ్రీనివాస్, దొమకొండ తిరుపతి, మధు నటరాజ్, జోగినపల్లి రమాదేవి, సూపరింటెండెంట్ ద్యావళ్ల కిరణ్ పాల్గొన్నారు.

216
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles