వైభవంగా రథోత్సవం

Mon,March 25, 2019 02:38 AM

తిమ్మాపూర్, నమస్తే తెలంగాణ: నల్లగొండ గ్రామంలోని శ్రీ సీతారామ లక్ష్మీనృసింహస్వామి బ్రహ్మత్సోవాల్లో భాగంగా ఆదివారం స్వామివారి రథోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జాతరకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. శనివారం రాత్రి స్వామివారిని రథంపైకి తీసుకువచ్చారు. ఆదివారం ఉదయం జిల్లా నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో వచ్చిన భక్తులు స్వామివారిని దర్శించుకునేందుకు బారులు తీరారు. మానకొండూర్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, బీజేపీ కిసాన్‌మోర్చా జాతీయ ప్రధాన కార్యదర్శి పొల్సాని సుగుణాకర్‌రావు, టీఆర్‌ఎస్ అసెంబ్లీ కార్యాలయ కార్యదర్శి మాదాడి రమేశ్‌రెడ్డి, తదితరులు హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దేవాదాయ శాఖ ద్వారా ఆలయాభివృద్ధికి నిధులు మంజూరయ్యాయనీ, త్వరలో పనులు పూర్తయ్యేలా చూస్తామన్నారు. ఆలయ ప్రాంగణంలో కల్యాణ మండపాన్ని త్వరలోనే అందుబాటులోకి తీసుకువచ్చేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. అనంతరం ఆలయ కమిటీ అధ్యక్షుడు పారుపెల్లి రాజిరెడ్డి, ఆలయ ఈఓ ముద్దసాని శంకర్, ఆలయ కమిటీ సభ్యులు ఎమ్మెల్యేను సన్మానించి వారికి ప్రసాదాలు అందజేశారు. సర్పంచ్‌లు దన్నమనేని శోభ, గాండ్ల భాగ్యలక్ష్మి, బోయిని కొమురయ్య, నాయకులు ఉల్లెంగుల ఏకానందం, దన్నమనేని సురేందర్‌రావు, దన్నమనేని నర్సింగరావు, గాండ్ల శ్రీనివాస్, ఆలయ కమిటీ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

88
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles