మీ పోరాటం మరువలేనిది

Mon,March 25, 2019 02:38 AM

పెద్దపల్లిటౌన్: జర్నలిస్టుల పోరాటలు మరువలేనివని రాష్ట్ర సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టు అసోసియేషన్-143 ఉమ్మడి కరీంనగర్ జిల్లా మహాసభలు పెద్దపల్లి అమర్‌చంద్ కల్యాణ మం డపంలో మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ అధ్యక్షతన ఆదివారం ఘనంగా నిర్వహించారు. మంత్రి, ఎమెల్యే దాసరి మనోహర్‌రెడ్డితో కలిసి మహాసభకు హాజరై మాట్లాడుతూ, జర్నలిస్టులు తెలంగాణ ఉద్యమంలో ఆనాటి ఉద్యమ సారథి కేసీఆర్ వెంట నడిచారని గుర్తు చేశారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటులో వారి పాత్ర ప్రధానమై నదని వివరించారు. తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టుల సంక్షేమానికి ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటైన తర్వాత సీఎం కేసీఆర్ అనేక పథకాలు ప్రవేశపెట్టారన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా జర్నలిస్టులకు సంక్షేమనిధి, బీమా సౌకర్యం, అక్రిడిటేషన్‌లు, హెల్త్‌కార్డులు, అలాగే ఏ జర్నలిస్టు అయినా ప్రమాదానికి గురైతే వారికి కార్పొరేట్ వైద్యం అందేలా చర్యలు తీసుకున్నారని వివరించారు. జర్నలిస్టు మరణిస్తే వారి కుటుంబానికి మూడు లక్షలు ఇవ్వడంతో పాటు చదువుకునే చిన్న పిల్లలు ఉన్నట్లయితే వారు పదోతరగతి పూర్తి చేసుకునే దాకా నెలకు మూడు వేలు అందించేలా సూచనలు చేశారని తెలిపారు. కేసీఆర్‌కు తెలంగాణ మీడియానే వెన్నుదన్నుగా ఉన్నదన్నారు. తెలంగాణ ఉద్యమకారులను ప్రత్యేక రాష్ట్ర సాధన సమయంలో ఎల్లవేళలా వివిధ రకాలైన కథనాలతో ఉత్తేజితులను చేసింది జర్నలిస్టులేనని కొనియాడారు. తెలంగాణ ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్ జర్నలిస్టులను ప్రత్యేక గౌరవంతో చూస్తారన్నారు.

మీడియా సహకారం మరువలేనది..
జర్నలిజం ఎంతో బాధ్యతతో కూడినదని, దాన్ని సమాజానికి మేలు కలిగేలా ఉపయోగించాలని ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి పేర్కొన్నారు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా సమాజంలో మీడియా విస్తృతమైందన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటైన నాటి నుంచి ప్రభుత్వానికి అండగా ఉంటూ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో మీడియా సహకారం మరువలేనిదని పేర్కొన్నారు. జర్నలిస్టులు నిష్పక్షపాతంగా వ్యవహరించాలన్నారు. జర్నలిస్టు వృత్తి ఎంతో కష్టమైనా విలేకరులు సామాజిక స్పృహను కోల్పోవద్దని పేర్కొన్నారు. సమాజంలోని సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకురావడంలో జర్నలిస్టులు ముందుండాలని సూచించారు.

ప్రతిపాదనలు లేకపోయినా..
జర్నలిస్టులకు ప్రభుత్వం అండగా ఉందని తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నా రాయణ తెలిపారు. తెలంగాణ ఏర్పాటైన వెంటనే ముఖ్యమంత్రి కేసీఆర్ మీడియా నుంచి ఎలాంటి ప్రతిపాదనలు లేకపోయినా స్వయంగా సంక్షేమనిధి, అక్రిడిటేషన్‌లు, డబుల్‌బెడ్‌రూం ఇండ్ల నిర్మా ణం లాంటి ఎన్నో కార్యక్రమాలకు ప్రణాళికలు రూపొందించారని చెప్పారు. ఇప్పటికే చాలా వరకు ఆచరణలోకి వచ్చాయని గుర్తు చేశారు. జర్నలిస్టుల ఇతర వినతులకు ఇప్పటికే టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆమోదం తెలిపారని పేర్కొన్నారు. ఈక్రమంలోనే కొన్ని జిల్లాల్లో జర్నలిస్టులకు డబుల్‌బెడ్ రూం ఇండ్ల నిర్మాణం సాగుతున్నదన్నారు. జర్నలిస్టులు సైతం ఓపికతో వ్యవహించాల్సిన అవసరమున్నదన్నారు. రాష్ట్రం కొత్తగా ఏర్పడిన క్రమంలో ప్రభుత్వానికి జర్నలిస్టుల సహకారం ఎంతో అవసరమని పేర్కొన్నారు. పెద్దపల్లి, కరీంనగర్, రాజన్నసిరిసిల్ల, జగిత్యాల జిల్లాల కమిటీలను త్వరలో ప్రకటిస్తామని నారాయణ తెలిపారు. జర్నలిస్టు నాయకులు బిజిగిరి శ్రీనివాస్, ఇస్మాయిల్, మారుతి సాగర్, వేణుగోపాల రావు, వివిధ జిల్లాల నాయకులు, జర్నలిస్టులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

82
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles