నేడు సిరిసిల్లకు కేటీఆర్

Mon,March 25, 2019 02:38 AM

రాజన్న సిరిసిల్ల ప్రతినిధి, నమస్తేతెలంగాణ: టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కల్వకుంట్ల తారక రామారావు సిరిసిల్ల నియోజకవర్గంలో నేడు పర్యటించనున్నారు. పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో సోమవారం సా యంత్రం 6గంటలకు నిర్వహించనున్న బహిరం గ సభలో ఆయన పాల్గొని ప్రసంగించనున్నారు. సభకు కేటీఆర్‌తో పాటు వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్, కరీంనర్ ఎంపీ అభ్యర్థి బోయినిపల్లి వినోద్‌కుమార్ హాజరు కానున్నారు. సభకు 15వేల మందిని తరలిం చేందుకు గులాబీశ్రేణులు సమాయత్తమవుతున్నారు. సభ ఏర్పాట్లను టెస్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్‌రావు, రాష్ట్ర నేతలు చీటి నర్సింగరావు, గూడూరి ప్రవీణ్, పట్టణ అధ్యక్షుడు జిందం చక్రపాణిలతో కలిసి ఎంపీ వినోద్‌కుమార్ ఆదివారం పరిశీలించారు.

వరుసగా బహిరంగ సభలు..
పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో భాగంగా టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేటి నుంచి ఏప్రిల్ 2 వరకు నియోజకవర్గంలోని అన్ని మం డలాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. తొలుత సోమవారం సా యంత్రం 6 గంటలకు సిరిసిల్ల ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానం లో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. అనంతరం 27న ఉదయం 10గంటలకు ము స్తాబాద్‌లో ఉదయం 10 గంటలకు, 29న సా యంత్రం 4గంటలకు ఎల్లారెడ్డిపేట, వీర్నపల్లి మండలంలో, 31న ఉదయం 10గంటలకు గంభీరావుపేట మండలం, ఏప్రిల్ 2న తంగళ్లపల్లి మండలంలో నిర్వహించే బహిరంగ సభల్లో కేటీఆర్ పాల్గొంటారు.

భారీగా తరలిరావాలి: ఎంపీ వినోద్
సిరిసిల్లటౌన్: జిల్లా కేంద్రంలోని జూనియర్ కళాశాల మైదానంలో నేడు నిర్వహించ తలపెట్టిన సభకు ప్రజలు భారీగా తరలిరావాలని కరీంనగర్ ఎంపీ అభ్యర్థి బోయినిపల్లి వినోద్‌కుమార్ పిలుపు నిచ్చారు. ఏర్పాట్లను టెస్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్‌రావుతో కలిసితో పరిశీలించా రు.

73
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles