అభివృద్ధికి కేరాఫ్‌గా నిలిచాం

Sat,March 23, 2019 01:47 AM

- జాతీయ రాజకీయాల్లో రాణిస్తాం
- రాబోయే సంకీర్ణంలో చక్రం తిప్పుతాం
- మరింత ప్రగతిని సాధించుకుంటాం
- రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్
- దేశంలో ప్రాంతీయ పార్టీలదే రాజ్యం
- అభివృద్ధి కోసం 16 సీట్లు గెలిపించాలి
- ప్రాజెక్టులకు జాతీయ హోదా సాధించుదాం: ఎంపీ వినోద్
- జమ్మికుంటలో రోడ్‌షో

జమ్మికుంట : ఉద్యమ బిడ్డలుగా ఆశీర్వదించిన హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజలను మరిచిపోలేమనీ, ఆ రుణం తీర్చుకుంటామని మంత్రి ఈటల రాజేందర్ హామీ ఇచ్చారు. జమ్మికుంటలో టీఆర్‌ఎస్ అర్బన్, మండలశాఖ అధ్యక్షుడు రాజ్‌కుమార్, పింగిళి రమేశ్ ఆధ్వర్యంలో మోత్కులగూడెం అంబేద్కర్ చౌక్ నుంచి తెలంగాణ చౌక్ వరకు నిర్వహించిన భారీ ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ నాయకులకు ఇక్కడ స్థానం లేదనీ, ప్రజలు గుండెల్లో పెట్టుకుని చూసుకునేది గులాబీ జెండానేనని స్పష్టం చేశారు. చెరువులు, కుంటలు నింపి, తూములు ఏర్పాటు చేస్తామని చెప్పారు. కరీంనగర్‌ను నీళ్ల జంక్షన్‌గా మారుస్తామన్నారు. నాడు ఆర్థిక మంత్రిగా, నేడు వైద్యశాఖ మంత్రిగా సీఎం కేసీఆర్ అవకాశం ఇవ్వడం పట్ల కృతజ్ఞతలు తెలిపారు. ఎంపీ వినోదన్నకు హుజూరాబాద్ నియోజకవర్గం నుంచి లక్ష మెజార్టీని ఇస్తామని స్పష్టం చేశారు.

ప్రగతి సాధించాలంటే 16 సీట్లు గెలిపించాలి : ఎంపీ వినోద్‌కుమార్
దేశంలో ఈ ఎన్నికలు ముఖ్యమైనవనీ, రాష్ట్ర ఆర్థిక ప్రగతి సాధించాలంటే 16 సీట్లు గెలిపించాలని ఎంపీ వినోద్‌కుమార్ కోరారు. దేశంలో రానున్నది ప్రాంతీయ పార్టీల రాజ్యమేనన్నారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ప్రజలు చెప్పుకోదగ్గ ఏ ఒక్క పథకాన్నీ అందించలేదని విమర్శించారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను అందిస్తున్నదనీ, దేశానికే తెలంగాణ దిక్సూచిగా మారిందన్నారు. పోలవరానికి జాతీయ హోదా ఇచ్చారనీ, మన ప్రాజెక్టులకు ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల తర్వాత ప్రాజెక్టులకు జాతీయ హోదా సాధించేందుకు కొట్లాడుతామని చెప్పారు. నేషనల్ హైవేలు, రైల్వే లైన్లు, తదితర అభివృద్ధి నిధులు తెచ్చుకుందామని తెలిపారు. సీఎం కేసీఆర్ జాతీయస్థాయిలో పలు పార్టీలను ఏకం చేసిన విషయాన్ని వివరించారు. బతికున్నంత వరకూ ప్రజలకు సేవ చేస్తాననీ, మరోసారి ఆశీర్వదించి అవకాశాన్ని ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. రాష్ర్టానికే నా జీవితాన్ని అంకితం చేస్తానన్నారు. ఇక్కడ జిల్లా ఇన్‌చార్జి సారయ్య, ఎమ్మెల్సీ నారదాసు, ఐడీసీ చైర్మన్ శంకర్‌రెడ్డి, మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ అక్బర్‌హుస్సేన్, రాష్ట్ర సహకార సంఘాల యూనియన్ చైర్మన్ రాజేశ్వర్‌రావు తదితరులు పాల్గొన్నారు.

119
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles