రోడ్‌షో విజయవంతం చేయాలి

Sat,March 23, 2019 01:45 AM

మానకొండూర్: పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా శనివారం మండల కేంద్రంలో ఎంపీ అభ్యర్థి బీ వినోద్‌కుమార్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రోడ్‌షో, ప్రచార సభకు టీఆర్‌ఎస్ శ్రేణులు, ప్రజలు అధిక సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ పిలుపు నిచ్చారు. మండల కేంద్రంలోని జీవీఆర్ నివాసంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన రోడ్‌షో, ప్రచారసభ వివరాలు వెల్లడించారు. పార్లమెంట్‌లో ప్రజా సమస్యలపై మాట్లాడుతూ దేశంలోనే ఉత్తమ ఎంపీగా గౌరవం దక్కించుకున్న వినోదన్నకు నియోజకవర్గం నుంచి భారీ మెజార్టీ అందించడానికి పార్టీ శ్రేణులు సైనికుల్లా పని చేయాలని పిలుపు నిచ్చారు. నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో రోడ్‌షోలు చేపడుతామని తెలిపారు. ఈనెల 23న మానకొండూర్, 26న ఇల్లంతకుంట, 28న గన్నేరువరం, 30న తిమ్మాపూర్, ఏప్రిల్ ఒకటిన శంకరపట్నం, 3న బెజ్జంకి మండల కేంద్రాల్లో రోడ్‌షో నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. మానకొండూర్ మండల కేంద్రంలోని పల్లెమీద చౌరస్తా వద్ద శనివారం సాయంత్రం నాలుగు గంటలకు రోడ్‌షో ప్రారంభమై తూర్పుదర్వాజ, మార్కెట్ ఏరియా మీదుగా గడిమహాల్ వరకు సాగుతుందన్నారు. గడిమహాల్ ఎదుట ప్రచారసభ ఉంటుందని తెలిపారు. ఈ సమావేశంలో సుడా చైర్మన్ జీవీ రామకృష్ణారావు, జడ్పీటీసీ ఎడ్ల సుగుణాకర్, టీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు తాళ్లపెల్లి శేఖర్‌గౌడ్, టీఆర్‌ఎస్వీ నియోజకవర్గ కన్వీనర్ గుర్రం కిరణ్‌గౌడ్, నాయకులు నూతి శ్రీనివాస్, రామంచ గోపాల్‌రెడ్డి, ముద్దసాని ప్రదీప్‌రెడ్డి, నామాల శ్రీనివాస్, రెడ్డి సంపత్‌రెడ్డి, ముల్కల సత్యనారాయణ, నర్మెట్ట వీరయ్య, బొల్లం వెంకటయ్య, నెల్లి శంకర్, కొండ్ర నిర్మల, కోమల, ఎరుకల శ్రీనివాస్‌గౌడ్, దండబోయిన శేఖర్, నల్లగొండ తిరుపతిగౌడ్, ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, తదితరులు పాల్గొన్నారు.

79
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles