గంగాధరలో డిగ్రీ కళాశాల

Sat,March 23, 2019 01:45 AM

గంగాధర: గంగాధరలో డిగ్రీ కళాశాల ఏర్పాటు చేస్తామని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ అన్నారు. మండలంలోని మధురానగర్‌లో శుక్రవారం డిగ్రీ కళాశాల ఏర్పాటుకు స్థల పరిశీలన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఇక్కడ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేస్తే గంగాధరతోపాటు చుట్టు పక్కల మండలాల విద్యార్థులకు సౌకర్యంగా ఉంటుందన్నారు. డిగ్రీ చదివేందుకు కరీంనగర్, జగిత్యాల పట్టణాలకు వెళ్లే ఇబ్బందులు తప్పుతాయన్నారు. గతంలో ఎమ్మెల్యేగా పని చేసినవారు ఇక్కడ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయడంలో విఫలమయ్యారని విమర్శించారు. ఎన్నికల సమయంలో గంగాధర, కొడిమ్యాల మండలాల్లో డిగ్రీ కళాశాలలు, రామడుగు మండలంలో జూనియర్ కళాశాల, గంగాధరలో 30 పడకల దవాఖాన, గర్శకుర్తిలో ప్రాథమిక ఆరోగ్యకేంద్రం మంజూరు చేస్తానన్న హామీలను నెరవేరుస్తానన్నారు. సీఎం కేసీఆర్, మంత్రులు ఈటల రాజేందర్, జగదీశ్‌రెడ్డి, ఎంపీ వినోద్‌కుమార్ దృష్టికి తీసుకువెళ్లి వీలైతే 2019-20 విద్యా సంవత్సరం నుంచే గంగాధరలో డిగ్రీ కళాశాల తరగతులు ప్రారంభించేలా చూస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఎంపీపీ దూలం బాలగౌడ్, జడ్పీటీసీ ఆకుల శ్రీలత, సింగిల్‌విండో అధ్యక్షుడు వొడ్నాల రాంరెడ్డి, టీఆరెస్వీ జిల్లా అధ్యక్షుడు ద్యావ మధుసూదన్‌రెడ్డి, యూత్ మండలాధ్యక్షుడు తాళ్ల సురేశ్, సర్పంచులు వేముల లావణ్య, దామోదర్, నాయకులు సాగి మహిపాల్‌రావు, కంకణాల రాజ్‌గోపాల్‌రెడ్డి, దూలం శంకర్‌గౌడ్, శ్రీరాం మధు, వాసాల గంగాధర్, పెంచాల చందు, నిమ్మనవేని ప్రభాకర్, శ్రీనివాస్, వినోద్ తదితరులు పాల్గొన్నారు.

92
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles