అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన వ్యక్తి అరెస్ట్

Fri,March 22, 2019 01:32 AM

కరీంనగర్ క్రైం : ఈనెల 17న సీఎం కేసీఆర్ బహిరంగ సభ సందర్భంగా చేసిన ప్రసంగాన్ని వక్రీ కరిస్తూ ఓ వ్యక్తి అభ్యంతరకర వ్యాఖ్యలతో వీడి యో చేసి టిక్ టాక్ అప్లికేషన్‌లో అప్‌లోడ్ చేశా డు. మత విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా ఉండడంతో పాటు ముఖ్యమంత్రిపై వ్యాఖ్యలు చేయడంతో దీన్ని తీవ్రంగా పరిగణించిన పోలీసులు బుధవారం ఆ వ్యక్తిపై కేసు నమోదు చేసి ఆరా తీశారు. నిందితుడు కిసాన్ నగర్‌కు చెందిన విలాసాగర్ సాయికుమార్‌గా గుర్తించారు. ఉద్దేశపూర్వకంగా వక్రీకరించి ఇరువర్గాల మధ్య గొడవలు రేకెత్తించే విధంగా ఉన్న వీడియోలు అప్‌లోడ్ చేయడంపై కేసు నమోదు చేసిన పోలీసులు గురువారం యువకుడిని అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించారు. సోషల్ మీడి యా ద్వారా ఇరువర్గాల మధ్య రెచ్చగొట్టే సందేశాలు చేయరాదని, ఇవి శిక్షార్హని సీఐ విజయ్‌కుమార్ తెలిపారు.

సోషల్ మీడియాను దుర్వినియోగం చేస్తే కఠిన చర్యలు : సీపీ కమలాసన్‌రెడ్డి
సోషల్ మీడియాను ప్రజాసంబంధాలు, సమాచార పంపిణీకి ఓ వేదికగా వినియోగించాలని సీపీ కమలాసన్‌రెడ్డి ప్రజలకు సూచించారు. చాలా మంది సోషల్ మీడియాను సమాజంలో వైషమ్యాలు పెంచేలా శాంతి భద్రతలకు భంగం కల్గించేలా దుర్వినియోగం చేస్తున్నారన్నారు. అలా ంటి సందేశాలు, వీడియోలు శిక్షార్హమని తెలిపారు. భావోద్వేగాలు రెచ్చగొట్టే విధంగా సందేశాలు, వీడియోలు, వాట్సప్ గ్రూపుల్లో షేర్ చేస్తే నాన్ బెయిలబుల్ కేసులు నమోదవుతాయని తెలిపారు. ఒక సారి కేసులు నమోదైతే జీవితాంతం హిస్టరి షీట్ లో ఉంటాయని, విద్యార్థులు, యువకులు తమకున్న అవకాశాలను కోల్పోతారని తెలిపారు. గ్రూప్ అడ్మిన్లు వివిధ వ్యక్తులు షేర్ చేసే విషయాలను గమనించాలని, లేదంటే అడ్మిన్లే బాధ్యత వహించాలని హెచ్చరించారు.

95
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles