నాడు అద్దె గది.. నేడు సొంత భవనం

Fri,March 22, 2019 01:32 AM

రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం ధర్మారం ప్రాథమిక ఆరోగ్య ఉపకేంద్రం ఏన్నో ఏళ్ల నుంచి అద్దె గదిలోనే కొనసాగుతూ వచ్చింది. అరకొర వసతుల మధ్య నడిచింది. గర్భిణులు, చిన్నపిల్లలకు నెలనెలా టీకాలు వేసేందుకు అటూ వైద్యసిబ్బంది.. ఇటు కేంద్రానికి వచ్చే ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. శాశ్వాత భవనాన్ని నిర్మించాలని చేసిన నాడు విజ్ఞాపనలు చేసినా ఎవరూ పట్టించుకోలేదు. కానీ, స్వరాష్ట్రంలో ఈ సమస్యకు పరిష్కారం దొరికింది. పలువురు టీఆర్‌ఎస్ నాయకుల వినతికి ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. నూతన భవన నిర్మాణానికి రూ.3లక్షల నిధులను మంజూరు చేసింది. ఆ నిధులతో అధునూతన సౌకర్యాలతో ప్రాథమిక ఆరోగ్య ఉపకేంద్రాన్ని నిర్మించగా, ఇప్పుడు మెరుగైన వైద్య సేవలు అందుతున్నాయి. నూతన భవనంలోనే వైద్యం అందిస్తుండగా, గ్రామస్తుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.

అద్దె తప్పింది..
నాడు చాలా ఇబ్బందులు పడ్డాం. అద్దె గది చిన్నగా ఉండడంతో వైద్యం చేయించుకోవడానికి అవస్థలు పడేవాళ్లు. చాలా మంది ఆరుబయట ఎండలోనే నిలబడే వారు. అదీగాక సకాలంలో అద్దె చెల్లించకపోవడంతో పాటు పలు సమస్యలు తలెత్తాయి. తెలంగాణ ప్రభుత్వం వచ్చినంకనే నిధులు మంజూరు చేసి నూతన భవనాన్ని నిర్మించింది. దీంతో వైద్య సౌకర్యంతో పాటు మాకు అన్ని వసతులు సమకూరాయి. చాలా సంతోషంగా ఉంది.
- బెజ్జంకి బుజ్జి, ఏఎన్‌ఎం (ధర్మారం)

97
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles