వడగళ్ల వర్షం..పంటల నష్టం

Thu,March 21, 2019 01:11 AM

గంగాధర: మండలంలోని పలు గ్రామాల్లో బుధవారం కురిసిన వడగండ్ల వర్షానికి వరి, మామిడి పంటలకు నష్టం వాటిల్లింది. గర్శకుర్తి, తాడిజెర్రి, ఉప్పరమల్యాల, కురిక్యాల, వెంకంపల్లి, కొండన్నపల్లి, గంగాధర, మధురానగర్, మంగపేట, గోపాల్‌రావుపల్లి, మల్లాపూర్, గట్టుభూత్కూర్, హిమ్మత్‌నగర్ గ్రామాల్లో బుధవారం సాయంత్రం ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసింది. గులక రాళ్ల సైజులో పడిన వడగండ్లతో ఆయా గ్రామాల్లో పొట్ట దశలో ఉన్నటువంటి వరి పంట నేలకొరిగి దెబ్బతిన్నది. గోపాల్‌రావుపల్లిలో మామిడి పిందెలు రాలి తీవ్ర నష్టం వాటిల్లిందది. పోతుగంటిపల్లిలో వరి, టమాట, బీర, బెండ కూరగాయలు నేలరాలయి.

రైతులు అందోళన చెందవద్దు..
- ఎమ్మెల్యే సుంకె రవిశంకర్
వడగండ్ల వానతో పంటలు దెబ్బతిన్న రైతులెవ రూ అందోళన చెందవద్దని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ రైతులకు విజ్ఞప్తి చేశారు. దెబ్బతిన్న పంటలపై సర్వే చేసి నష్టాన్ని అంచనా వేయాలని అధికారులకు సూచించారు. నివేదిక ఆధారంగా పరిహారం చెల్లింపునకు చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.

నగరంలో మోస్తారు వర్షం..
కార్పొరేషన్: కరీంనగర్‌లో బుధవారం సాయ ం త్రం మోస్తారు వర్షం కురిసింది. మూడు రోజులు పెరుగుతున్న ఉష్ణోగ్రతతో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు ఈ వానతో ఉపశమనం కలిగిం టది. సా యంత్రం ఒక్కసారిగా మేఘావృతమై వర్షం కురియగా రాంనగర్, కొత్తయాస్వాడ, రాంపూర్ తదితర ప్రాంతాల్లో వడగాళ్లు పడ్డాయి. లోతట్టు ప్రాంతాల్లోని మురుగుకాల్వలు పొంగిపోర్లాయి

103
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles