వార్తలు నిష్పక్షపాతంగా రాయాలి

Wed,March 20, 2019 12:52 AM

-పార్లమెంట్ ఎన్నికల అధికారి, కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్
-కలెక్టరేట్‌లో మీడియా సెంటర్ ప్రారంభం
కరీంనగర్ ప్రతినిధి, నమస్తే తెలంగాణ: ఎన్నికల సమయంలో ఆయా పత్రికల విలేకరులు నిష్పాక్షపాతంగా వార్తలు రాయాలని పార్లమెంట్ ఎన్నికల అధికారి సర్ఫరాజ్ అహ్మద్ ఉద్బోదించారు. లోక్‌సభ ఎన్నికలకు సం బంధించి కలెక్టరేట్‌లోని సమాచార శాఖ కార్యాలయం లో ఏర్పాటు చేసిన మీడియా సెంటర్‌ను మంగళవా రం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికలకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని మీడియా సెంటర్ ద్వారా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకు ఎప్పటికప్పుడు అందజేస్తామన్నారు. మీడియా సెంటర్‌లో అన్ని ఏర్పాట్లు చేశామని చెప్పారు. ఎలక్ట్రానిక్ మీడియాకు సంబంధించి వార్తలను (లోకల్ చానల్స్) రికార్డింగ్ చేస్తున్నామని తెలిపారు. రాజకీయ పార్టీల ప్రతినిధులు ఛానల్స్‌లో ఇచ్చే ప్రకటనలకు మీడియా సర్టిఫికేషన్ మానిటరింగ్ కమిటీ నుంచి అనుమతి పొందాల్సి ఉంటుందన్నారు. ప్రింట్ మీడియాలో వచ్చే చెల్లింపు వార్తలను ఎంసీఎంసీ కమిటీ పర్యవేక్షిస్తుందన్నారు. ఎంసీఎంసీకి జిల్లా ఎన్నికల అధికారి చైర్మన్‌గా వ్యవహరిస్తారన్నారు. వార్తలను వార్తగానే రాయాలని సూచించారు. మీడియా సెంటర్‌లో కంప్యూటర్లు, టెలిఫోన్ తదితర సదుపాయాలు ఏర్పాటు చే శామన్నారు. ఎలక్ట్రానిక్, ప్రింట్ మీడియా ప్రతినిధులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. స్పెషల్ ఆఫీసర్ ప్రావీ ణ్య, అసిస్టెంట్ కలెక్టర్ రాజర్షిషా, సమాచార శాఖ ఉప సంచాలకులు పాకాల భాస్కర్, ఉప కార్యనిర్వాహక సమాచార ఇంజినీర్ సీహెచ్ కొండయ్య పాల్గొన్నారు.

79
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles