తొలిరోజే వినోద్ బోణీ

Tue,March 19, 2019 02:20 AM

* కరీంనగర్ ఎంపీ స్థానానికి రెండు సెట్ల నామినేషన్ల దాఖలు
* గులాబీ శ్రేణులతో కలిసి అట్టహాసంగా సమర్పణ
* హాజరైన మంత్రులు ఈటల, కొప్పుల, ఎమ్మెల్యేలు
* పిరామిడ్ పార్టీ ఆఫ్ ఇండియా తరపున హుజూరాబాద్ వాసి ఒకటి..
* మొదలైన లోక్‌సభ నామపత్రాల స్వీకరణ
* ఈ నెల 25 వరకు గడువు
* 21, 23, 24 సెలవు దినాలు : జిల్లా ఎన్నికల అధికారి సర్ఫరాజ్ అహ్మద్
కరీంనగర్ ప్రతినిధి, నమస్తే తెలంగాణ: లోక్‌సభ ఎన్నికలకు నగారా మోగింది. ఈ నెల 10న షెడ్యూల్ విడుదల కాగా, ఎన్నికల అధికారి, కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ ఆధ్వార్యాన సోమవారం నోటిఫికేషన్ జారీ అయింది. ఆ వెంటే నామినేషన్ల పర్వానికి తెరలేచింది. 21, 23, 24 సెలవు దినాలు మినహా ఈ నెల 25 వరకు నామినేషన్లు తీసుకోనున్నారు. ప్రతి రోజు ఉదయం 11గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు కరీంనగర్ కలెక్టరేట్ సమావేశమందిరంలో స్వీకరిస్తారు. 26న పరిశీలించి, 28న ఉపసంహరణకు అవకాశమిచ్చారు. ఏప్రిల్ 11న పోలింగ్ నిర్వహించనుండగా, మే 23న కౌంటింగ్ చేసి ఫలితాలను ప్రకటిస్తారు.

* తొలి రోజే వినోద్..
నామినేషన్ల తొలిరోజే సిట్టింగ్ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ టీఆర్‌ఎస్ తరపున రెండు సెట్లు దాఖలు చేశారు. సోమవారం మంత్రులు ఈటల, కొప్పుల, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులతో కలిసి కలెక్టరేట్‌లో కరీంనగర్ పార్లమెంట్ ఎన్నికల అధికారి, కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్‌కు నామినేషన్ పత్రాలు అందజేశారు. అలాగే పిరామిడ్ పార్టీ ఆఫ్ ఇండియా తరుపున హుజూరాబాద్ పట్టణంలోని గాంధీనగర్‌కు చెందిన చింతల అనిల్ కుమార్ ఒక సెట్ దాఖలు చేశారు.

* 21, 23, 24 సెలవు దినాలు : జిల్లా ఎన్నికల అధికారి
ఎంపీ స్థానాలకు ఈ నెల 18 నుంచి 25 వరకు నామినేషన్లు స్వీకరిస్తారని కరీంనగర్ పార్లమెంటరీ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 21న హోలీ, 23న ప్రజా ప్రయోజనాల చట్టం 1951 నేగోషియెబుల్ ఇన్‌స్ట్రుమెంట్ యాక్ట్ ప్రకారం సెలవు దినం, 24న ఆదివారం సెలవు కావడంతో నామినేషన్లు స్వీకరించరని చెప్పారు. మిగతా రోజుల్లో ప్రతి రోజు ఉదయం 11గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు తీసుకుంటారని చెప్పారు.

88
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles