కరీంనగర్ సమస్యలపై సంపూర్ణ అవగాహన

Mon,March 18, 2019 01:41 AM

- ఎంపీ వినోద్‌కుమార్..
ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు మన రాష్ర్టాన్ని దేశంలోనే ముందు వరుసలో ఉంచేందుకు ప్రయత్నిస్తున్నారనీ కరీంనగర్ ఎంపీ వినోద్‌కుమార్ పేర్కొన్నారు. రాష్ట్రంలో 16 స్థానాల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థులు గెలిస్తే దేశ రాజకీయాలను మరింత ప్రభావితం చేస్తారని అన్నారు. జాతీయ రాజకీయాల్లో కేసీఆర్ ఉండాలని దేశ ప్రజలు కోరుకుంటున్నారని తెలిపారు. 2014లో తాను కరీంనగర్ నుంచి పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికైన తర్వాత సీఎం కేసీఆర్ ఈ నియోజకవర్గానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారు. 2004 నుంచి 2009 వరకు మూడు సార్లు కరీంనగర్ పార్లమెంట్‌కు కేసీఆర్ ప్రాతినిధ్యం వహించిన విషయాన్ని ఎంపీ గుర్తు చేశారు. ఆయన హయాంలోనే కరీంనగర్ నుంచి హైదరాబాద్‌కు నేరుగా రైల్వే లైన్ నిర్మాణం చేపట్టాలని ఆకాంక్షించి సర్వే పూర్తి చేసిన తర్వాత రాష్ట్రంలో, కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కనీసం ఆ ఫైల్స్ దుమ్ము కూడా దులుప లేదని మండిపడ్దారు. తెలంగాణ సాధించుకుని కేసీఆర్ సీఎం అయిన నెల రోజులకే రైల్వే లైన్ భూసేకరణ పనులకు ఆదేశాలిచ్చారని అన్నారు. భూ సేకరణకు అవసరమైన నిధులు తామే భరిస్తామని కేంద్రానికి లేఖ రాశారని స్పష్టం చేశారు. రైల్వే లైన్ పనులు వేగవంతంగా పూర్తి చేస్తున్నారని తెలిపారు.

ఇప్పటికే గజ్వేల్ వరకు రైలు పట్టాలు వేయించారనీ, రెండు మూడు నెలల్లో రైలు నడిచే విధంగా చర్యలు తీసుకుంటున్నారని పప్పారు. అదే విధంగా గజ్వేల్ నుంచి సిద్దిపేట, సిరిసిల్ల వరకు భూ సేకరణ పూర్తి చేసి రైల్వే టెండర్లను పిలిచిందని వివరించారు. సిద్దిపేట, సిరిసిల్ల, వేములవాడ, కరీంనగర్ వరకు భూ సేకరణ పనులు వేగవంతంగా జరుగుతున్నాయన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నపుడు కేవలం 2,500 కిలో మీటర్ల జాతీయ రహదారులు మాత్రమే ఉండేవీన తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ రాష్ర్టానికి జాతీయ రహదారులు పెంచాలని పార్లమెంట్ సభ్యులందరితో ఢిల్లీలో పనిచేయించి ఇపుడు అదనంగా 3,500 కిలో మీటర్ల జాతీయ రహదారులను సాధించి పెట్టారని అన్నారు. కరీంనగర్ నగరంలో కేవలం 3 లక్షల జనాభా మాత్రమే ఉన్నప్పటికి స్మార్ట్ సిటీ జాబితాలో దీనిని చేర్చాలని చెప్పి ప్రధానికి, కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రికి నేరుగా ఫోన్‌లో మాట్లాడి దేశంలోని వంద స్మార్ట్‌సిటీలో కరీంనగర్‌కు స్థానం కల్పించారని అన్నారు.

దీంతో ఐదేళ్లలో రూ. వెయ్యి కోట్లు నగర అభివృద్ధికి రాబోతున్నాయని అన్నారు. రాష్ట్రం నుంచి కూడా రూ. 500 కోట్లు ఇస్తామని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారనీ, ఇపుడు పనులు వేగవంతంగా జరుగుతున్నాయని ఎంపీ స్పష్టం చేశారు. కరీంనగర్‌లో ట్రిబుల్ ఐటీ ఏర్పాటుకు కూడా సీఎం కేసీఆర్ ప్రధానికి లేఖ రాశారని అన్నారు. కరీంనగర్ పార్లమెంట్ నియోజవర్గానికి 2004 నుంచి 2009 వరకు మూడు సార్లు ప్రాతినిధ్యం వహించిన నేపథ్యంలో ఉమ్మడి జిల్లా సమస్యలపై పూర్తిగా అవగాహన ఉన్న మహానాయకుడు కేసీఆర్ అని తెలిపారు. కరీంనగర్ జిల్లాను రాష్ట్రంలో మొదటి వరసలో ఉంచేందుకు కృషి చేస్తున్నారని అన్నారు. పార్లమెంట్ ఎన్నికల కోసం కరీంనగర్‌లో మొదటి సభ ఏర్పాటు చేసి జాతీయ రాజకీయాలపై చర్చించిందుకు కేసీఆర్ ఇక్కడి రావడం తనకు ఎంతో సంతోషంగా ఉన్నదని ఎంపీ వినోద్‌కుమార్ స్పష్టం చేశారు.

కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బోయినపల్లి వినోద్‌కుమార్ అధ్యక్షతన జరిగిన ఈ భారీ బహిరంగ సభలో టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు, సెక్రెటరీ జనరల్ కే కేశవరావు, మంత్రులు కొప్పుల ఈశ్వర్, ఎర్రబెల్లి దయాకర్ రావు, రాజ్యసభ సభ్యులు కెప్టెన్ లక్ష్మీకాంతరావు, సంతోష్‌కుమార్, ఉమ్మడి జిల్లా ఇన్‌చార్జి బస్వరాజ్ సారయ్య, ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్, చెన్నమనేని రమేష్‌బాబు, ఒడితెల సతీష్‌కుమార్, బల్క సుమన్, సుంకె రవిశంకర్, కే విద్యాసాగర్ రావు, దాసరి మనోహర్ రెడ్డి, రసమయి బాలకిషన్, కోరుకంటి చందర్, ఎమ్మెల్సీలు పాతూరి సుధాకర్ రెడ్డి, నారదాసు లక్ష్మన్ రావు, భాను ప్రసాద్ రావు, టీ సంతోష్‌కుమార్, జడ్పీ అధ్యక్షురాలు తుల ఉమ, మాజీ ఎమ్మెల్యేలు పుట్ట మధు, కోడూరి సత్యనారాయణ గౌడ్, ఆరెపల్లి మోహన్, పలు కార్పోరేషన్ల చైర్మన్లు ఈద శంకర్ రెడ్డి, అక్భర్ హుసేన్, కోలేటి దామోదర్, రాకేష్, నగర మేయర్ సర్దార్ రవిందర్ సింగ్, రామగుండం మేయర్ రాజమణి, సుడా చైర్మన్ జీవీ రామకృష్ణారావు, గ్రంథాలయ చైర్మన్ ఏనుగు రవిందర్‌రెడ్డి మాజీ ఎమ్మెల్సీ సుధాకర్‌రావు పాల్గొన్నారు..

110
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles