బ్యాంక్ ఖాతాల వివరాలు అందజేయాలి

Sun,March 17, 2019 12:54 AM

కరీంనగర్ ప్రతినిధి, నమస్తే తెలంగాణ: లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులకు సంబంధించి బ్యాంక్ ఖాతాల లావాదేవీల వివరాలు ఎన్నికల సంఘానికి అందజేయాలని జిల్లా ఎన్నికల అధికారి సర్ఫరాజ్ అహ్మద్ బ్యాంకు అధికారులను కో రారు. శనివారం కలెక్టరేట్‌లో బ్యాంకర్లు, రాజకీ య పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎన్నికల ప్రవర్తనా నియమావళిని పకడ్బందీగా అమలు చేసేందుకు గాను రెండు నెలల్లో బ్యాంకుల నుంచి రూ. 10 లక్షలకు మించి విత్‌డ్రా చేసుకున్నా, రూ. 10 లక్షలు నగదు జమ చేసిన వారి అకౌంట్ల వివరాలు ఇవ్వాలన్నారు. అలాగే ఒక ఖాతా నుం చి మరొక ఖాతాలోకి డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేసే వారి వివరాలు, అకౌంట్ల వివరాలు అందజేయాలన్నారు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు, వారి కుటుంబ సభ్యులు ప్రతి రోజు లక్షకు మించి విత్‌డ్రా చేసుకోవడం, లక్ష నగదు జమ చేసే వారి అకౌంట్ల వివరాలు అందజేయాలన్నారు. బ్యాం కుల నుంచి ఏటీయంలకు రోజు వారీగా తీసుకెళ్లే డబ్బుల వివరాలు, వ్యాన్ సిబ్బంది వివరాలు అం దజేయాలన్నారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున రాజకీయ పార్టీల అభ్యర్థులు, కార్యకర్తలు ఎక్కువ మొత్తంలో నగదు వాహనాల్లో తీసుకెళ్లరాదని తెలిపారు. చెక్‌పోస్టుల వద్ద వాహనాల తనిఖీ ఉంటుందని, తగిన ఆధారాలు లేకుండా తీసుకెళ్తే సీజ్ చేస్తామన్నారు. రూ. 10లక్షలకు పై నగదు ఉంటే ఇన్‌కంట్యాక్స్ అధికారులకు సమాచారమివ్వాలని సూచించారు. నోట్ల పంపిణీపై ప్ర జలకు సమాచారం తెలిస్తే 1950 టోల్ ఫ్రీ నెంబర్‌కు ఫిర్యాదు, సమాచారమివ్వాలని కోరారు. డీ ఆర్వో భిక్షానాయక్, ఎన్నికల నోడల్ అధికారి శ్రీనివాస్,లీడ్ బ్యాంకు మేనేజర్ రమేశ్‌కుమార్, అధికారులు, పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.

174
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles