పూర్తి స్థాయిలో ఈవీఎంల తనిఖీ

Sun,March 17, 2019 12:54 AM

కరీంనగర్ ప్రతినిధి, నమస్తే తెలంగాణ: లోక్‌సభ ఎన్నికల్లో వినియోగించే ఈవీఎంలను పూర్తి స్థా యిలో మొదటిస్థాయి తనిఖీ నిర్వహిస్తున్నామని జిల్లా ఎన్నికల అధికారి సర్ఫరాజ్ అహ్మద్ పేర్కొ న్నారు. శనివారం కలెక్టరేట్ వెనుక భాగంలో గల ఈవీఎంల గోదాంలో రెండో రోజు ఈవీఎంల మొ దటిస్థాయి తనిఖీ కార్యక్రమాన్ని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల నుంచి వచ్చిన 1111 బ్యాలెట్ యూనిట్లు, 991 కంట్రోల్ యూనిట్లు, 981 వివి ప్యాట్లను తనిఖీ చేస్తున్నామన్నారు. ఈవీఎంల పనితీరును బీఈఎల్ నుంచి వచ్చిన 43 మంది ఇంజినీర్లు, 150 మంది రెవెన్యూ సిబ్బంది ఆధ్వర్యంలో బ్యాలెట్, కంట్రోల్ యూనిట్లు, వీవీ ప్యాట్‌ల బటన్ల పనితీరును పరిశీలిస్తున్నామని, పాత డేటాను తొలగించి అప్‌డేట్ చేసి లోక్‌సభ ఎన్నికలకు సిద్ధ్దం చేస్తున్నామన్నారు. సరిగ్గా పని చేసే బ్యాలెట్, కంట్రోల్ యూనిట్లు, వీవీ ప్యాట్లలకు ఆకుపచ్చ రంగు స్టిక్కర్లను రెవెన్యూ సిబ్బంది అతికిస్తున్నారని తెలిపారు. ఈవీఎంల గోదాం వద్ద గట్టి పోలీసు బందోబస్తును, సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామన్నారు. వికారాబాద్ జిల్లా నుంచి శనివారం రాత్రి వరకు మరికొన్ని ఈవీఎం య ంత్రాలు వస్తాయని, మరో రెండు రోజుల పాటు ఈవీఎంల మొదటిస్థాయి తనిఖీ కార్యక్రమం ఉంటుందన్నారు. జేసీ జీవీ శ్యామ్ ప్రసాద్‌లాల్, కలెక్టరేట్ ఎన్నికల పర్యవేక్షకురాలు మాధవి, బీఈఎల్ ఇంజనీర్ నితిన్ అధికారులు పాల్గొన్నారు.

93
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles