-జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్
కరీంనగర్ ప్రతినిధి, నమస్తే తెలంగాణ: పట్టభద్రు లు, ఉపాధ్యాయ నియోజకవర్గాల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ముద్రించిన బ్యాలెట్ పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించాలని ఎన్నికల అధికారి, కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ అధికారులను ఆదేశిం చారు. శనివారం కలెక్టరేట్లో రెవెన్యూ సిబ్బంది నిర్వహిస్తున్న ఎమ్మెల్సీ ఎన్నికల బ్యాలెట్ పత్రాల పరిశీలన కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సం దర్భంగా మాట్లాడుతూ ఈనెల 22న జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి పట్టభద్రుల నియోజకవర్గానికి 376 పోలింగ్ కేంద్రాలు, ఉపాధ్యాయ నియోజకవర్గానికి 256 పోలింగ్ కేంద్రా లు ఏర్పాటు చేశామని తెలిపారు. పట్టభద్రులకు సంబంధించి 1,96,321 మంది ఓటర్లు, ఉపాధ్యాయ నియోజకవర్గానికి సంబంధించి 23,214 మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారని తెలిపారు. రాష్ట్ర ఎన్నికల సంఘం నిబంధనల మేరకు గ్రాడ్యుయేట్ బ్యాలెట్ పత్రాలు తెలుపు రంగులో, ఉపాధ్యాయ బ్యాలెట్ పత్రాలు పింక్ రంగులో ముద్రించామని తెలిపారు. ఫొటోలో ఉన్న అభ్యర్థుల పేర్లు, ఫోటోలు, సీరియ ల్ నెంబర్లు, బోర్డర్లు తదితర అంశాలన్నింటిని రెవె న్యూ సిబ్బంది పరిశీలిస్తారని తెలిపారు. అనంతర ం పోలింగ్ సామగ్రితో పాటు బ్యాలెట్ పత్రాలను మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ ఉమ్మడి జిల్లాలోని అన్ని డివిజన్లకు పటిష్ట పోలీసు బందోబస్తు మధ్య పంపిస్తామన్నారు. డీఆర్వో భిక్షానాయక్, కరీంనగర్, హుజురాబాద్ రెవెన్యూ డివిజన్ల అధికారులు ఆనంద్‌కుమార్, చెన్నయ్య, కలెక్టరేట్ ఎఓ రాజ్కుమార్పాల్గొన్నారు.
ప్రైవేట్ సంస్థలు అనుమతించాలి..
పట్టభద్రులు, ఉపాధ్యాయ నియోజకవర్గాల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ రోజు ప్రైవేట్ సంస్థలలో పనిచేసే ఉద్యోగులందరూ పని వేళల్లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఆయా ప్రైవేట్ సంస్థల యజమాన్యాలు అనుమతించాలని జిల్లా ఎన్నికల అధికారి సర్ఫరాజ్ అహ్మద్ ఒక ప్రకటనలో కోరారు. జిల్లాలో వివిధ ప్రైవేట్, వ్యాపార సంస్థలు, పరిశ్రమల్లో పని చేసే ప్రైవేట్ ఉద్యోగులు ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో ఓ టు హక్కు కలిగి ఉన్నారని తెలిపారు. ఈనెల 22 న జరుగు ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ఉద యం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు కొనసాగుతుందని ఉద్యోగులను ఓటు హక్కు వినియోగించుకొనుటకు వీలుగా షిప్టు పద్దతిలో, ఆలస్యంగా వచ్చేందుకు సంబంధిత యజమాన్యాలు అనుమతించాలని కలెక్టర్ పేర్కొన్నారు.