అభివృద్ధిని చూసే టీఆర్‌ఎస్‌లో చేరికలు

Sun,March 17, 2019 12:52 AM

-ఎమ్మెల్యే సుంకె రవిశంకర్
-కేసీఆర్ సభకు తరలిరావాలి
-టీఆర్‌ఎస్‌లో 250 మంది చేరిక
గంగాధర: రాష్ట్రంలో సీఎం కేసీఆర్ చేస్తున్న అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలను చూసే వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు టీఆర్‌ఎస్‌లో చేరుతున్నారని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ అన్నారు. గట్టుభూత్కూర్ గ్రామానికి చెందిన సుమారు 100 మంది శనివారం బూరుగుపల్లిలోని ఎమ్మెల్యే నివాసంలో టీఆర్‌ఎస్‌లో చేరగా, కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో 70 ఏళ్లలో జరగని అభివృద్ధిని సీఎం కేసీఆర్ నాలుగున్నరేళ్లలో చేసి చూపించారన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో కరీంనగర్ ఎంపీగా బోయినిపల్లి వినోద్‌కుమార్‌ను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. జిల్లా కేంద్రంలోని పోలీస్ స్పోర్ట్స్ స్కూల్ మైదానంలో ఆదివారం నిర్వహించే సీఎం కేసీఆర్ సభకు నియోజకవర్గ ప్రజలు వెల్లువలా తరలిరావాలని పిలుపు నిచ్చారు. అనంతరం ఆయన పార్టీ శ్రేణులతో సభకు తరలివెళ్లే విషయమై సమావేశం నిర్వహించారు. కేసీఆర్ సభకు నియోజకవర్గం నుంచి 30 వేల మందిని తరలించడం లక్ష్యం కాగా, 40 వేల మందిని తరలించడానికి ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. నియోజకవర్గంలోని ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు సైనికుల్లా పని చేసి సభ విజయవంతానికి కృషి చేయాలని పిలుపు నిచ్చారు. ఈ సమావేశంలో ఎంపీపీ దూలం బాలగౌడ్, కేడీసీసీబీ డైరెక్టర్ వెలిచాల తిర్మల్‌రావు, సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు మేచినేని నవీన్‌రావు, యూత్ మండలాధ్యక్షుడు తాళ్ల సురేశ్, నాయకులు ఆకుల మధుసూదన్, ఉప్పుల గంగాధర్, కంకణాల రాజ్‌గోపాల్‌రెడ్డి, ఎండీ బాషుమియా, పబ్బతి తిరుపతిరెడ్డి, చిలుముల సుధాకర్, తదితరులు పాల్గొన్నారు.

రామడుగు: బంగారు తెలంగాణ ఏర్పాటులో సీఎం కేసీఆర్‌కు అండగా ఉండేందుకే ప్రతిపక్షాల నాయకులు టీఆర్‌ఎస్‌లో చేరుతున్నారని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ అన్నారు. కాంగ్రెస్ మండల ఉపాధ్యక్షుడు తొరికొండ నారాయణ, వెదిర గ్రామానికి చెందిన సుమారు 150 మంది నాయకులు ఎమ్మెల్యే సమక్షంలో శనివారం టీఆర్‌ఎస్‌లో చేరగా, గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరెన్ని కుట్రలు పన్నినా ప్రతిపక్షాలకు చోటు లేకుండా ప్రజలు టీఆర్‌ఎస్‌కు మద్దతు పలికారన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో కూడా రాష్ట్ర ప్రజలు రెట్టింపు ఉత్సాహంతో టీఆర్‌ఎస్ విజయానికి తోడ్పాటు అందించి, మన ఐక్యతను జాతీయ స్థాయిలో నిలుపాలని విజ్ఞప్తి చేశారు. టీఆర్‌ఎస్‌లో చేరిన వారిలో కాంగ్రెస్ మండల ఉపాధ్యక్షుడు తొరికొండ నారాయణ, ప్రముఖ వ్యాపారవేత్త దొడ్డ లచ్చిరెడ్డి, వార్డు సభ్యుడు బొల్లి రమేశ్, రెడ్డి సంఘం గ్రామశాఖ అధ్యక్షుడు రాళ్లబండి శ్రీనివాస్‌రెడ్డి, సభ్యుడు నరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, తదితరులున్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకుడు వీర్ల వెంకటేశ్వరరావు, ఎంపీపీ మార్కొండ కిష్టారెడ్డి, కొక్కెరకుంట సింగిల్ విండో చైర్మన్ వొంటెల మురళీకృష్ణారెడ్డి, నాయకులు నాగుల రాజశేఖర్‌గౌడ్, పుర్మాని శ్రీనివాస్‌రెడ్డి, మెల్లా జగన్మోహన్‌రెడ్డి, ఎరెడ్డి కొమురెడ్డి, కొడిముంజ లేఖరాజు, సిద్ది లక్ష్మణ్, కుమ్మరి ప్రసాద్, శనిగరపు భూమయ్య, దొడ్డ వెంకటేశ్వరరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

95
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles