జిల్లాలో రూ.105 కోట్ల బకాయిలు

Sat,March 16, 2019 01:00 AM

జమ్మికుంట: జిల్లాలో ఇప్పటి వరకు రూ.105 కోట్ల బకాయిలున్నాయనీ, విద్యుత్ వినియోగదారులు వెంటనే బకాయిలను చెల్లించాలని ఎస్‌ఈ మాధవరావు పేర్కొన్నారు. జమ్మికుంటలో విద్యుత్ అధికారులు, సిబ్బందితో సమీక్షా సమావేశం నిర్వహించిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. వినియోగదారులకు ప్రభుత్వం నాణ్యమైన కరెంటును అందిస్తున్నదనీ, వినియోగదారులు కూడా బిల్లులను సకాలంలో చెల్లించి సంస్థకు సహకరించాలని కోరారు. పేరుకుపోయిన బకాయిల్లో స్ట్రీట్ లైట్లు రూ.74కోట్లు, రైతులు రూ.9 కోట్లు, గృహ వినియోగం రూ.8 కోట్ల 74 లక్షలు, ప్రభుత్వ కార్యాలయాలు రూ.5 కోట్ల 41 లక్షలు, ప్రైవేట్ సర్వీసులు రూ.4 కోట్ల32లక్షలు, ఇండస్ట్రీలు రూ.3 కోట్లు, ఇతరములు రూ.కోటి 18లక్షలున్నాయని తెలిపారు. మార్చి 31వరకు బకాయిలను చెల్లించాలన్నారు. జిల్లాలో కోట్లాది రూపాయలతో విద్యుత్ అభివృద్ధి పనులు చేపట్టామనీ, అందులో ఒక్క జమ్మికుంటలోనే రూ.4కోట్ల పనులు చేశామని వివరించారు. మరో రూ.2కోట్లను ఇక్కడ వెచ్చించేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఇక ఆర్వోబీ రెండు పక్కలున్న విద్యుత్ స్తంభాలను తొలిగిస్తామనీ, మున్సిపల్ అధికారులు వెంటనే మార్కింగ్ చేయాలని సూచించారు. గతంలోనే అధికారులకు చెప్పినా మార్కింగ్ చేయలేదన్నారు. మార్కింగ్ చేసిన వారం రోజుల్లో పోల్స్‌ను తొలగిస్తామని తెలిపారు. నిరుపేదలకు రూ.125కే మీటర్, సర్వీస్ వైరు, బల్బును కూడా అందిస్తామని చెప్పారు. వ్యవసాయ బావులకు విద్యుత్ మీటర్లు కావాల్సిన రైతులు నేరుగా మీ సేవ కేంద్రాల్లోనే దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. సమావేశంలో డీఈ తిరుపతి, ఏడీఈ శ్రీనివాస్‌రెడ్డి ఉన్నారు.

101
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles