కేంద్రంలో కేసీఆర్ కీలక పాత్ర

Sat,March 16, 2019 01:00 AM

హుజూరాబాద్, నమస్తే తెలంగాణ: వచ్చే పార్లమెంట్ ఎన్నికల అనంతరం కేంద్రంలో కేసీఆర్ కీలకపాత్ర పోషించనున్నాడని రాజ్యసభ సభ్యుడు బడుగు లింగయ్యయాదవ్ పేర్కొన్నారు. కేసీఆర్ సభ సన్నాహక సమావేశాల్లో భాగంగా శుక్రవారం కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ పట్టణంలోని టీఆర్‌ఎస్ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ నెల 17న కరీంనగర్‌లో జరిగే సీఎం కేసీఆర్ సభ కు రెండున్నర లక్షల జనాభా స్వచ్ఛందంగా రానున్నారని తెలిపారు. బీజేపీ, కాంగ్రెస్‌కు కేవలం వం దలోపే ఎంపీ సీట్లు వచ్చే అవకాశాలున్నాయని జోస్యం చెప్పారు. కేసీఆర్ ఏర్పాటు చేసిన ఫెడరల్ ఫ్రంట్ వంద సీట్లు గెలచి కేంద్రంలో చక్రం తిప్ప డం ఖాయమన్నారు. దీనిలో భాగంగా ఇక్కడి నుంచి 16 ఎంపీ సీట్లను బహుమానంగా తెలంగాణ ప్రజలు కేసీఆర్‌కు ఇవ్వాలని ఆయన కోరా రు. టీఆర్‌ఎస్ సర్కార్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు దేశానికి ఆదర్శంగా నిలుస్తాయన్నారు. ఇప్ప టి రైతుబంధు పథకానికి ప్రధాని నరేంద్రమోదీ మార్పులు చేర్పులు చేసి కిసాన్ సమ్మాన్‌నిధిగా ప్ర వేశపెట్టాడని గుర్తు చేశారు. ఇవేకాకుండా రైతుల కోసం బీమా, 24 గంటల కరెంట్, చెరువుల పునరుద్దరణ వంటి కార్యక్రమాలు కూడా అనుసరించాల్సిన ఆవశ్యకత ఉందన్నారు.

దేశంలో సరైన ప్రాజెక్టులు లేక నీళ్లు వృథాగా పోతున్నాయనీ, కేసీఆర్ కేంద్రంలో కీలక పాత్ర పోషించిన తర్వాత నీటి వృథాను అరికట్టి సాగుకు ఉపయోగపడేలా చేస్తారని చెప్పారు. 70 ఏళ్ల స్వతంత్ర భారతదేశం లో కాంగ్రెస్, బీజేపీ పాలనలో ఇంకా కరెంట్‌కు నోచుకోని గ్రామాలు ఎన్నో ఉన్నాయని వివరించారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు ఇంతవరకు జాతీయహోదా కేంద్రం ఇవ్వలేదనీ, దీంతోపాటు మరెన్నో సాధించుకోవాలంటే అత్యధికంగా ఎంపీ స్థానా లు గెలిపించాలన్నారు. అప్పుడే కేంద్రాన్ని యా చించే స్థాయి నుండి శాసించే స్థాయికి వెళ్లి అధిక నిధులు రాబట్టు కోవచ్చన్నారు. ఎంపీ వినోద్‌కుమార్‌ను మరోసారి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ సమావేశంలో నాయకులు బండ శ్రీనివాస్, ఎడవెల్లి కొండాల్‌రెడ్డి, గోపు కొంరారెడ్డి, దాసరి రమణారెడ్డి, తాళ్లపెల్లి శ్రీనివాస్, కన్నెబోయిన శ్రీనివాస్, పింగిలి రాజేందర్‌రెడ్డి, మొలుగూరి ప్రభాకర్, కన్నెబోయిన విజేందర్, రాజ్‌కుమార్, బూసారపు బాబురావు, సదానందం, సాయిబాబా, కుమార్, రమేశ్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

104
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles