ఖాతాదారులకు మెరుగైన సేవలందించాలి

Fri,March 15, 2019 01:06 AM

శంకరపట్నం: బ్యాంకర్లు ఖాతాదారులకు మెరుగైన సేవలందించాలని నాబా ర్డ్ డీడీఎం అనంత్ పట్నా సూచించారు. గురువారం మండల పరిషత్‌లో ఎస్‌బీఐ లీడ్ బ్యాంక్ మేనేజర్ రమేశ్ కు మార్ ఆధ్వర్యంలో (శంకరపట్నం, వీణవంక, సైదాపూర్) మండలస్థాయి బ్యాంకర్ల కమిటీ (జేఎమ్‌ఎల్‌బీసీ) స మావేశం నిర్వహించారు. ఈ సందర్భం గా మాట్లాడుతూ ప్రభుత్వ రుణాలను అర్హులకు అందించాల్సిన బాధ్యత బ్యాంకర్లపై ఉన్నద న్నా రు. బ్యాంకు అధికారులు ఎస్సీ, మైనార్టీ లబ్ధిదారుల రుణాలను వెంటవెంటనే గ్రౌండింగ్ చేయాలన్నారు. పంటల బీమా పథకాలపై వ్యవసా యశాఖ అధికారులు రైతులకు అవగాహన కల్పించాలన్నారు. ఈ సందర్భంగా డిసెంబర్ 2018 వరకు ఆయా బ్యాంకులు రైతులకు ఇచ్చే పంట రుణాల లక్ష్యాన్ని సాధించాయా..?, పీఎంఎంబీవై, డబ్ల్యూబీసీఐఎస్ పథకాలు ఎంత మంది రైతులకు వర్తింపజేశారు..? 2017-18 సంవత్సరాలకు గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఐకేపీ ద్వారా వర్తింపజేసిన ప్రభుత్వ పథకాలు.. పీఎంజేజేబీవై, పీఎంఎస్‌బీవై, ఏపీవై తదితర సామాజిక భద్రత పథకాలు, ముద్ర, స్టాండప్ ఇండియా పథకాల అమల్లో ఎదురవుతున్న సమస్యలపై చర్చించారు. అలాగే రుణాల మంజూరు, వసూళ్ల లక్ష్య సాధనలో ఎదురవుతున్న ఇబ్బందులను చర్చించారు. ఆర్‌సెటీ డైరెక్టర్ దత్తాత్రి మాట్లాడుతూ ఉపాధి కల్పనలో తమ సంస్థ ద్వారా 61 రకాల స్వయం ఉపాధి పథకాలపై శిక్షణ ఇస్తున్నట్లు వెల్లడించారు. నిరుద్యోగ యువత ఆదాయ మార్గాలను సూ చించే శిక్షణను సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఎంపీడీఓ వినోద, డీఆర్‌డీఏ ఏపీఎం-బీఎల్ లిం గం గౌడ్, ఎస్సీ కార్పొరేషన్ డీపీఓ విజయ్ కుమా ర్, ఈఓపీఆర్డీ చండీరాణి, ఆంధ్రాబ్యాంక్ కన్వీనర్ (ఆర్‌డీఓ) సంగీత, ఏఓలు శ్రీనివాస్, గణేశ్, ఇండెన్ బ్యాంక్, తెలంగాణ గ్రామీణ బ్యాం క్, కేడీసీసీ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ మేనేజర్లు అర్జున్, చం ద్రకాంత్, శ్యాంసుందర్‌రెడ్డి, రంజిత్ ఉన్నారు.

106
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles