-ఎమ్మెల్యే సుంకె రవిశంకర్
-టీఆర్ఎస్లో భారీగా చేరికలు
చొప్పదండి, నమస్తేతెలంగాణ: టీఆర్ఎస్ సర్కారు అమలు చేస్తున్న ప్రజాసంక్షేమ పథకాలు మెచ్చి, బంగారు తెలంగాణ నిర్మాణంలో భాగస్వాములయ్యేందుకే ఇతర పార్టీల ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, కులసంఘాల నాయకులు గులాబీ గూటికి చేరుతున్నారని చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పేర్కొన్నారు. బూర్గుపల్లిలోని ఎమ్మెల్యే నివాసగృహంలో మండలంలోని కొలిమికుంటకు చెందిన 150 మంది వివిధ కులసంఘాలకు చెందిన నాయకులు ఆయన మక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు. సుంకె రవిశంకర్ మాట్లాడుతూ, పార్టీ నాయకులు, కార్యకర్తలకు అండగా ఉంటామని తెలిపారు. ఎంపీటీసీ అమనగంటి స్వప్న, మాజీ సర్పంచ్ నెరుమట్ల మల్లేశం, తోట శేషాద్రి, తదితరులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యే రసమయి సమక్షంలో..
గన్నేరువరం: మండలంలోని గునుకుల కొండాపూర్, మైలారం, యాస్వాడా, ఖాసీంపేట, గన్నేరువరం గ్రామాల్లో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలు గురువారం సాయంత్రం తిమ్మాపూర్ మండలం అల్గునూరులోని నియోజకవర్గ కార్యాలయంలో ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు. గునుకులకొండాపూర్ గ్రామ సర్పంచ్ లింగంపెల్లి జ్యోతి, నాయకుడు లింగంపెల్లి బాల్‌రాజు, బెజ్జంకి బీజేపీ మండలాధ్యక్షుడు లింగంపెల్లి నాగరాజుతోపాటు 200 మంది చేరగా, వీరికి ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. జిల్లా ఆర్ఎస్ఎస్ కోఆర్డినేటర్ తిరుపతి, నాయకులు జీ మన్మోహన్రావు, గంప వెంకన్న, బూర వెంకటేశ్వర్లు, బద్దం సంపత్‌రెడ్డి, హన్మండ్ల నర్సయ్య, గూడెల్లి నరేశ్, న్యాలట్ల లక్ష్మణ్, లింగంపెల్లి బాల్ లింగయ్య, ఎల్. శంకర్, తిరుపతి, తదితరులు పాల్గొన్నారు.