వార్ వన్ సైడే..

Thu,March 14, 2019 01:42 AM

- గులాబీ గెలుపు ఖాయం.. డబుల్ మెజార్టీయే లక్ష్యం
- ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కే పట్టం
- తాజాగా లోక్‌సభలోనూ అదే దూకుడు
- పక్కా ప్రణాళికతో తెలంగాణ రాష్ట్ర సమితి
- ఇప్పటికే పార్టీ శ్రేణులకు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దిశానిర్దేశం
- గత ఎన్నికల్లో రెండు లక్షలకు పైగా మెజార్టీతో వినోద్‌కుమార్ జయకేతనం
- దేశంలోనే అత్యుత్తమ ఎంపీగా పేరు
- ప్రస్తుతం పోటీ అంటేనే జంకుతున్న ప్రతిపక్షాలు


(కరీంనగర్ ప్రధాన ప్రతినిధి, నమస్తే తెలంగాణ) సుధీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన ఎంపీ వినోద్‌కుమార్ 2014 ఎన్నికల్లో కరీంనగర్ లోకసభ నియోజకవర్గం నుంచి అఖండ మెజార్టీతో విజయం సాధించారు. ఆరంభం నుంచి నేటి వరకు ప్రజలే ప్రాణంగా.. పగతే లక్ష్యంగా ముందుకు సాగుతూ వస్తున్నారు. ఇందులో భాగంగానే ఎన్నో ప్రగతి కార్యక్రమాలకు అంకురార్పరణ చేశారు. అసాధ్యం అనుకున్న ఎన్నో పనులను సుసాధ్యం చేసి చూపించారు. ఇందుకు స్మార్ట్‌సిటీ సాధన ఒక ఉదాహరణగా చెప్పవచ్చు. స్మార్ట్‌సిటీ ఎంపికకు సంబంధించి కేంద్రం తయారు చేసిన నిబంధనల ప్రకారం కరీంనగర్ ఎంపిక కావడానికి అర్హత లేదు. కానీ, తన పరిణతి, విజ్ఞతతో కేంద్రాన్ని ఒప్పించి కరీంనగర్‌కు స్మార్ట్‌సిటీ సాధించి పెట్టారు. ఇది అసాధ్యం అంటూ ప్రతిపక్షాలు చేసిన విమర్శలకు స్మార్ట్‌సిటీని సాధించి దీటైన జవాబు ఇచ్చారు. ఇవేకాదు.. అసాధ్యం అనుకున్న జాతీయ రహదారులను సాధించి చూపెట్టారు ఎంపీ వినోద్‌కుమార్. ఇందులో జగిత్యాల-కరీంనగర్- హుజూరాబాద్- వరంగల్ (216 కిలోమీటర్లు) జాతీయ రహదారిని మంజూరు చేయించారు. ప్రస్తుతం భూసేకరణ కొనసాగుతోంది. కరీంనగర్- సిరిసిల్ల- కామారెడ్డి-పిట్లం (165కిలోమీటర్లు) భూసేకరణ సాగుతోంది. సిరిసిల్ల-సిద్దిపేట-జనగాం-సూర్యాపేట( 184 కిలోమీటర్లు), ఎల్కతుర్తి-సిద్దిపేట-మెదక్ (130 కిలోమీటర్లు), మొలంగూరు-చల్లూరు- జమ్మికుంట- వావిలాల- భూపాలపల్లి (131 కిలోమీటర్లు) జాతీయ రహదారులను సాధించిన ఘనత ఎంపీకి దక్కుతుంది. ఇవేకాదు.. మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ విశ్వవిద్యాలయం కరీంనగర్ టౌన్‌కు మంజూరు చేయించారు. రూ.10కోట్ల నిధులు విడుదల చేయించారు. రూ.1.30 కోట్లతో ఆయూష్ ఆసుపత్రి మంజూరు చేయించారు.

ప్రస్తుతం కరీంనగర్ టౌన్‌లో నిర్మాణం కొనసాగుతోంది. సంసద్ ఆదర్శ్ గ్రామ యోజన కింద (ఎస్‌ఏజీవై) కింద రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి తండాను దత్తత గ్రామంగా ఎంపిక చేశారు. దేశంలో ఎంపీలు తీసుకున్న దత్తత గ్రామాల్లో 7వ స్థానంలో నిలబెట్టారు. దేశంలో 50 నిర్భయ కేంద్రాలను ఏర్పాటు చేస్తే అందులో ఒకటి కరీంనగర్‌లో ఏర్పాటు చేయించారు. రైల్వే లైన్ పెద్దపల్లి- నిజామాబాద్ రైలు మార్గం 180 కిలోమీటర్ల పొడవు ఉండగా.. ఈ లైన్‌ను పూర్తి చేయడానికి 24 సంవత్సరాలు పట్టింది. కొత్తపల్లి- మనోహరాబాద్ మొత్తం 152 కిలోమీటర్లు కాగా, 2016 ఆగస్టు 7న ఈ పనులకు ప్రధానమంత్రి నరేంద్రమోడీ, సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేశారు. ఆ మేరకు తొలి విడత రూ.350 కోట్లు కేటాయించిన కేంద్రం.. గత బడ్జెట్‌లో రూ.125 కోట్లు కేటాయించింది. పనులు జెట్ స్పీడ్‌తో నడిపించడంలో ప్రత్యేక శ్రద్ధపెట్టారు. రూ.104 కోట్లతో ఉప్పల్, బిజిగిరి షరీఫ్ రైల్వేస్టేషన్ పరిధిలో రైల్వే ఓవర్ బ్రిడ్జి సాంక్షన్ చేయించారు. అలాగే కరీంనగర్‌లోనూ రైల్వే ఓవర్ బ్రిడ్జి మంజూరు చేయించారు. ఇవి ఎంపీ వినోద్‌కుమార్ చేసిన పనుల్లో కొన్ని మచ్చుకు మాత్రమే.. ఇలా విభిన్న రంగాల్లో అభివృద్ధి పనులకు అంకురార్పరణ చేసి తన పరిణతి చాటుకున్నారు. ఇవేకాదు.. రాజీవ్ రహదారి( కరీంనగర్- హైదరాబాద్) ఎక్స్‌ప్రెస్ హైవేగా కేంద్రంచే గుర్తింపచేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

జై అంటున్న లబ్ధిదారులు
ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో భారీ మెజార్టీనిచ్చి గులాబీ జెండాకు పట్టం కట్టిన ప్రజలు.. వివిధ పథకాల లబ్ధిదారులు మళ్లీ ఎంపీ అభ్యర్థికి పట్టం కట్టేందుకు సిద్ధమవుతున్నారు. ముఖ్యంగా దేశంలో ఎక్కడా లేని విధంగా అమలవుతున్న పథకాలు ప్రజల గుండెల్లో చెరగని ముద్రవేస్తున్నాయి. రైతు బంధు పథకం కింద ఇప్పటికే ఎకరాకు రూ.4వేలు ఇస్తుండగా ఈ సీజన్‌నుంచి రూ.5వేల చొప్పున ఏడాదికి రూ.10వేలు ఇవ్వడానికి నిర్ణయించారు. అందుకోసం గత బడ్జెట్‌లో నిధులు కేటాయించారు. అలాగే లక్ష లోపు రుణ మాఫీ చేయడానికి నిర్ణయించి నిధులు కేటాయించారు. రైతు బీమా పథకాన్ని మరింత బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తున్నారు. గతంలో రూ.1000 వేయి ఉన్న ఫించన్‌ను వచ్చే ఏప్రిల్ నుంచి రూ.2016కు పెంచాలని నిర్ణయించారు. వికలాంగు ల పింఛన్ ప్రస్తుతం నెలకు రూ.1500లు ఉండే దానిని రూ.మూడు వేలకు పెంచుతున్నా రు. ఇవే కాదు.. నిరుద్యోగ భృతి ఇచ్చేందుకు బడ్జెట్‌లో నిధులు కేటాయించారు. అంతే కా కుండా కేసీఆర్ కిట్లు, కల్యాణలక్ష్మి, షాదీ ముభారక్ వంటి ఎన్నో పథకాల కింద మరింత ఎక్కువ మందికి లబ్ధి చేకూర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించిన విషయం తెలిసిందే. ముఖ్యమంత్రి ప్రజా సంక్షేమం కోసం ప్రవేశపెట్టి అమలు చేస్తున్న ఎన్నో పథకాలు ప్రజల జీవణ ప్రమాణాలను మార్చుతున్నాయి. ఇవన్నీ గులాబీ పార్టీకి అండగా నిలువనున్నాయి.

అధిక మెజార్టీయే లక్ష్యం
2014 లోకసభ ఎన్నికల్లో ఎంపీ వినోద్‌కుమార్‌కు 5,05,358 ఓట్లు రాగా, పొన్నం ప్రభాకర్‌కు 3,00,706 ఓట్లు వచ్చాయి. అంటే కాంగ్రెస్ అభ్యర్థిపై 2,04,652 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. 1952 లో కరీంనగర్ లోక్‌సభ నియోజకవర్గం ఏ ర్పడగా.. ఆనాటి నుంచి 2014 ఎన్నికల వ రకు అత్యధిక మెజార్టీ సాధించిన వారిలో ఇద్దరు టీఆర్‌ఎస్‌కు చెందిన వారే. అందు లో 2006 ఉపఎన్నికల్లో కేసీఆర్ అప్పటి కాంగ్రెస్ అభ్యర్థి జీవన్‌రెడ్డిపై 2,01,582 ఓ ట్లతో విజయం సాధిస్తే.. ఆ మెజార్టీని వినోద్‌కుమార్ అధిగమించారు. మొత్తం లోకసభ నియోజకవర్గంలో ఉపఎన్నికలను కలుపుకొని 18 సార్లు ఎన్నికలు జరిగితే.. అత్యధిక మెజార్టీ సాధించిన ఘనత వినోద్‌కుమార్‌కే దక్కింది. ప్రస్తుతం ఆ మెజార్టీని అ ధిగమించడమే లక్ష్యంగా టీఆర్‌ఎస్ శ్రేణు లు పనిచేస్తున్నాయి. ఈ నెల 6న సన్నాహక సమావేశాన్ని నిర్వహించి పార్టీ వర్కింగ్ ప్రె సిడెంట్ కేటీఆర్ ఎంపీ వినోద్‌కుమార్ పనితీరుపై ప్రశంసలు కురిపించారు. అంతేకా దు.. కరీంనగర్ ఎంపీగానే కాకుండా రాష్ట్ర అవసరాల నేపథ్యంలో కేంద్రంలో వినోద్‌కుమార్ ఉండాల్సిన ఆవశ్యకత ఎంత ఉం దో వివరించి చెప్పారు. లోకసభ నియోజకవర్గంలో బూత్‌లవారీగా ఫలితాలను విశ్లేషిస్తామని సుస్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో టీఆర్‌ఎస్ శ్రేణులు ఎవరికి వారే తమ బూ త్ పరిధిలో అత్యధిక మెజార్టీని సాధించే విషయంపై దృష్టి సారించాయి. ఇదే సమయంలో కరీంనగర్ లోక్‌సభ నియోజకవ ర్గం పరిధిలోనే ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో (చొప్పదండి, హుస్నాబాద్, హుజురాబాద్, కరీంనగర్, మానకొండూరు, సిరిసిల్ల, వేములవాడ) టీఆర్‌ఎస్ మంచి దూ కుడు మీద ఉంది. తాజాగా జరిగిన ఏడు అ సెంబ్లీ నియోజకవర్గాల్లోనూ గులాబీ జెండా ను ఎగురవేసి పార్టీ శ్రేణులు.. అదే జోరును లోక్‌సభ ఎన్నికల్లోనూ కొనసాగించాలని పావులు కదుపుతున్నాయి. 2014లో కరీంనగర్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలకు 5.91,441 ఓట్లు వస్తే.. తాజాఅసెంబ్లీ ఎన్నికల్లో 6,92,256 ఓట్లు వచ్చాయి. అంటే 1,00,815 ఓట్లు అదనంగా వచ్చాయి. 2014లో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలు ఒకేసారి జరిగాయి. ప్ర స్తుతం ఆ పరిస్థితి లేదు. సీఎంతో పాటు క్షే త్రస్థాయి వరకు ప్రతిఒక్కరూ ఎంపీ ఎన్నికలపై దృష్టి సారిస్తున్నారు. ఈ నేపథ్యంలో మించి మెజార్టీ వచ్చి తీరుతుందన్న నమ్మ కం టీఆర్‌ఎస్ శ్రేణుల్లో బలంగా ఉంది.

పోటీకి జంకుతున్న ప్రతిపక్షాలు
ప్రస్తుతం టీఆర్‌ఎస్ జోష్ కొనసాగుతున్న పరిస్థితుల నేపథ్యంలో కరీంనగర్ లోక్‌సభ నుంచి పోటీచేసేందుకు ప్రతిపక్షాల అభ్యర్థులు జంకుతున్నారు. పోటీకి నిలుపకపోతే పరువు పోతుందన్న ఉద్దేశంలో బరిలో బలవంతంగా నిలుచునేందుకు ఆంగీకారం తెలుపుతున్నారే తప్ప.. గెలుస్తామన్న నమ్మకం ఏ ఒక్క పార్టీకి లేదన్న వాదన, అభిప్రాయాలు, కాంగ్రెస్, బీజేపీ వంటివాటిలోనే బలంగా వినిపిస్తున్నాయి. అంతేకాదు.. కరీంనగర్ లోక్‌సభ పరిధిలోని ఏడు నియోజకవర్గాల్లో కాంగ్రెస్, బీజేపీ తన పట్టును పూర్తిగా కోల్పోయాయి. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఒక్క సీటును కైవం చేసుకోలేకపోయింది. ప్రస్తుతం లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు నేరెళ్ల శారద, జిల్లా అధ్యక్షుడు కటకం మృత్యుంజయం బరిలో ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే ఇటీవల మాజీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డిని బరిలోకి తెచ్చేందుకు ప్రయత్నాలు జరిగాయని సమాచారం. సాధ్యాసాధ్యాలను చూసిన ఆయన విముఖత వ్యక్తం చేశారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో పొన్నం ప్రభాధరే అభ్యర్థిగా ఉండే అవకాశం ఉందని తెలుస్తున్నప్పటికీ ఇటీవల జరిగిన శాసనభ ఎన్నికల్లో ఆయన కరీంనగర్ నుంచి పోటీచేసి మూడోస్థానంలో నిలువడం అయనకు పార్టీలో పెద్ద మైనస్‌గా మారింది. అంతేకాదు.. ప్రజలు సైతం కాంగ్రెస్ పార్టీని ఆదరించే పరిస్థితులు కనిపించడం లేదు. అలాగే బీజేపీ విషయంలో రామకృష్ణారెడ్డి, బండిసంజయ్ పేర్లు వినిపిస్తున్నాయి. అయితే క్షేత్రస్థాయిలో ఉన్న పరిస్థితులను చూసినా, అమలవుతున్న సంక్షేమ పథకాలను చూసినా, ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పును చూసినా, వీటన్నింటికీ మంచి కరీంనగర్ లోకసభ లో గత ఐదేళ్లుగా ఎంపీ వినోద్‌కుమార్ పనిచేస్తున్న తీరు నేపథ్యంలో ప్రతిపక్షాలు కనీస పోటీ ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నాయన్న అభిప్రాయాలు బలంగా వ్యక్తమవుతున్నాయి.

గెలుపు లాంఛనమే..?
అభివృద్ధియే లక్ష్యంగా ముందుకు దూసుకెళ్తున్న ఎంపీ వినోద్‌కుమార్ తిరిగి టీఆర్‌ఎస్ అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నారు. ఇప్పటికే ఈ విషయాన్ని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రకటించారు. అంతేకాదు.. ఎంపీ వినోద్‌కుమార్‌ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రజలకు, పార్టీ నాయకులకు పిలుపునిచ్చారు. అంతేకాదు.. వివాదాస్పదరహితుడిగా, పనిమంతుడిగా, కేసీఆర్‌కు అత్యంత విశ్వసనీయుడిగా ము ద్ర పడిన ఎంపీ వినోద్‌కుమార్.. ప్రజల గుండెల్లోనూ చెరగని ముద్రవేసుకున్నారు. గడిచిన ఐదేళ్ల కాలంలో అయన చేసిన అభివృద్ధి పనులు, అనుసరించిన వ్యవహార శైలి, ప్రజలకు అందుబాటులో ఉన్న విధానం, ప్రజలు దృష్టికి తెచ్చే సమస్యలపై స్పందించిన తీరు, విషయంమేదైనా వాటి పరిష్కార మార్గం కోసం ఆయన చూపిన చొరవ, ప్రజలకు వివరించే తీరు, అలాగే.. లోక్‌సభ వేదికగా రాష్ట్ర ప్రయోజనాలతో పాటు కరీంనగర్ లోక్‌సభ నియోజకవర్గం అభివృద్ధి అంశాలపై మాట్లాడిన తీరు, ప్రతిపక్షాల విమర్శలకు తనదైన శైలిలో చెప్పిన సమాధానాల వంటి ఎన్నో అంశాలు ప్రజల గుండెల్లో చెరగమని ముద్ర వేశాయి. నిజానికి కరీంనగర్ లోక్‌సభ నియోజకవర్గం ఆది నుంచీ గులాబీ జెండాను తన గుండెలకు హత్తుకుంటుంది. ఈ క్రమంలో.. ఉత్తమ ఎంపీగా ముద్ర పడిన ఎంపీ వినోద్‌కుమార్.. ఈ ఎన్నికల్లో గెలుపు ఖాయమన్న విషయం స్పష్టమవుతోంది. అంతేకాదు.. 16వ లోక్‌సభలో ఎంపీల పనితీరును సమీక్షిస్తూ పీఆర్‌ఎస్ ఇండియా సంస్థ ఇటీవల ఒక నివేదికను వెల్లడించిన విషయం తెలిసిందే. ఈ ప్రకారం చూస్తే గడిచిన ఐదేళ్లలో 106 చర్చల్లో పాల్గొనడమేకాదు.. ప్రైవేటు సభ్యుల బిల్లులను అత్యధికంగా ప్రవేశ పెట్టింది వినోద్‌కుమారే. ప్రశ్నోత్తరాల సమయంలో అత్యధిక ప్రశ్నలు వేసిన ఎంపీల్లో వినోద్‌కుమార్ రెండో స్థానంలో ఉండడం గమనార్హం. వివిధ అంశాలపై 552 ప్రశ్నలు సంధించినట్లుగా వెల్లడించింది. అంటే లోక్‌సభ వేదికను ఎంత బాగా వినియోగించుకున్నారో చెప్పడానికి పీఆర్‌ఎస్ ఇండియా సంస్థ వెల్లడించిన నిజాలను నిదర్శనంగా చెప్పవచ్చు.

155
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles