వామ్మో ఎండ

Thu,March 14, 2019 01:40 AM

ఎండలు మండుతున్నాయి. ఈ యేడాది ఫిబ్రవరి నుంచే ప్రభావం చూపుతున్నాయి. ఫిబ్రవరి నెలాఖరు నుంచే తీవ్రత పెరుగుతూ వస్తున్నది. మార్చిలో చూస్తే నెలాఖరున న మోదు కావాల్సిన ఉష్ణోగ్రతలు ఇప్పుడే న మోదవుతున్నాయి. బుధవారం కనిష్ఠంగా 20.5 డిగ్రీలు నమోదు, గరిష్ఠంగా 38.6, ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. గతేడాది మా ర్చి 13న గరిష్ఠ ఉష్ణోగ్రతలు 34.9 డిగ్రీలు మాత్రమే ఉండగా, ఈ రోజు 3.7 డిగ్రీలు ఎ క్కువగా నమోదయ్యాయి. మార్చిలోనే ఎం డలు దంచికొడుతుండడంతో జిల్లా ప్రజలు బెంబేలెత్తుతున్నారు. రెండు మూడు రోజులుగా ఉక్కపోత, వేడిగాలులతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. మూలనపడ్డ కూలర్లు, ఏసీలను ఇప్పటికే బాగు చేయించారు. అవి లేని వారు కొత్తగా కొనుకున్నారు. బయటకు వెళ్లే సమయంలో క్యాపులు, స్కార్ఫ్‌లు ధరిస్తున్నారు.

మున్ముందు తీవ్రం..
వచ్చే రెండు నెలల్లో ఎండలు మరింత ప్రభావం చూపుతాయని వాతావరణ అధికారులు చెబుతున్నారు. ఏప్రిల్, మే నెలల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 48 డిగ్రీలు దాటవచ్చని అంటున్నారు. మార్చిలోనే ఎండలు పెరగడమే ఇందుకు ఉదాహరణగా పేర్కొంటున్నారు. 2016లో తీవ్ర ప్రభావం చూపిన ఎండలు, ఈసారి పునరావృతం అవుతాయని హెచ్చరిస్తున్నారు. ఆ యేడాది గరిష్ఠంగా 48 డిగ్రీలు దాటడంతో పదుల సంఖ్యలో వడదెబ్బతో మృత్యువాత పడ్డారు. ఈ యేడాది ఎండలు భగ్గుమంటుండడంతో అధికారులు అప్రమత్తయ్యారు. ప్రభుత్వ ఆదేశాలతో ఎండల తీవ్రతకు ప్రాణ నష్టం కలగకుండా జాగ్రత్తలు తీసుకునే పనిలో పడ్డారు.

137
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles