మాతృభాషను కాపాడుకుందాం

Fri,February 22, 2019 01:05 AM

జమ్మికుంట: మాతృభాషాను కాపాడుకుందామని ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ సుజాత విద్యార్థులకు పిలుపునిచ్చారు. గురువారం కళాశాలలో మాతృభాష దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. తల్లి భాషను మ రవద్దని కోరారు. తెలుగు విభాగాధిపతి ఈశ్వర య్య మాట్లాడుతూ మాతృభాష ద్వారా మన భా వాలను సులభంగా అర్థం చేసుకోగలమన్నారు. ఇక్కడ అధ్యాపకులు ప్రేమ్‌చంద్, రామ్‌మోహన్‌రావు, మహేందర్‌రావు, స్వరూపారాణి, ప్రసాద్ తదితరులు ఉన్నారు.
సైదాపూర్: మండలంలోని ఆకునూర్‌లోని ప్రభు త్వ ఉన్నత పాఠశాలలో మాతృ భాషాదినోత్సవా న్ని నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు మాతృభాష వల్ల కలిగే ప్రయోజనాలను కవితలు, పాటలు, ఉ పన్యాసం ద్వారా వివరించారు. అనంతరం జరిగిన సమావేశంలో హెచ్‌ఎం అనురాధ మాట్లాడుతూ విషయ అవగాహనకు మాతృభాషే కీలకమన్నారు. ఉపాధ్యాయుడు శంకర్ ఉన్నారు.

86
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles