బల్దియా బడ్జెట్ @189.49 కోట్లు

Thu,February 21, 2019 02:55 AM

కార్పొరేషన్, నమస్తే తెలంగాణ: కరీంనగర్ నగరపాలక సంస్థ 2019-20 ఆర్థిక సంవత్సరానికి రూ.189.49 కోట్ల అంచనాతో బడ్జెట్‌ను రూపొందించారు. ఎప్పటిలాగే బల్దియా బడ్జెట్‌లో 40 శాతం మేరకు ప్రభుత్వ గ్రాంట్ల ద్వారా ఆదాయం వస్తుందని అంచనాలు వేయటం విశేషం. ఈ బడ్జెట్‌లో రూ.10.89 కోట్లను సేవింగ్స్ కింద చూపించారు. దీనిలో భారీగా ఆదాయం రూ. 71.49 కోట్ల మేర గ్రాంట్ల ద్వారానే వస్తుందని అధికారులు అంచనాలు వేశారు. 2018-19 ఆర్థిక సంవత్సరంలో రూ. 257.78 కోట్లతో అంచనా బడ్జెట్ పెట్టిన అధికారులు ఈ సారి రూ.189.49 కోట్లతో సిద్ధం చేశారు. కాగా అంచనా బడ్జెట్‌కు బుధవారం సాయంత్రం మేయర్ చాంబర్‌లో జరిగిన స్టాండింగ్ కమిటీ సమావేశం ఆమోదం తెలిపింది. గతేడాది రూ.257.78 కోట్లతో అంచనా బడ్జెట్ సిద్ధం చేయగా, దానిని రూ.163.33 కోట్లకు సవరించారు. స్టాండింగ్ కమిటీ సమావేశంలో ముఖ్యంగా బల్దియా కార్యాలయానికి సోలార్ విద్యుత్ అందించేందుకు, నగరంలో పలు ప్రాంతాల్లో కమ్యూనిటీ హాళ్ల నిర్మాణానికి రూ.5 కోట్లు కేటాయిస్తూ తీర్మానం చేశారు.

-ఆదాయం ఇలా ...
అధికారులు రూ.189.49 కోట్ల అంచనాతో రూపొందించిన బడ్జెట్‌లో గ్రాంట్ల ద్వారా రూ. 71.49 కోట్లు రానున్నట్లు అంచనా వేయగా, డిపాజిట్లు, అడ్వాన్సులు, అప్పుల కింద రూ. 20.95 కోట్లు వస్తాయని చూపారు. కాగా గతంలో ఇంటి పన్నుల ద్వారా రూ.24 కోట్లు వస్తాయని అధికారులు అంచనా వేయగా, ఈ సారి ఏకంగా రూ.44.50 కోట్లుగా చూపడం విశేషం. అలాగే ఇతర ఆదాయాల ద్వారా రూ. 5 కోట్లు, టౌన్ ప్లానింగ్ ద్వారా రూ. 20.20 కోట్లు, ఇంజినీరింగ్ ద్వారా రూ.11.54 కోట్లు వస్తాయని అంచనా వేశారు.

134
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles