దళితుల సంక్షేమానికి పెద్దపీట

Thu,February 21, 2019 02:54 AM

చొప్పదండి,నమస్తేతెలంగాణ: ముఖ్యమంత్రి కేసీఆర్ దళితుల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నారని ఎమ్మెల్యే సుంకెరవిశంకర్ పే ర్కొన్నారు. చొప్పదండిలో రూ. 13లక్షలతో నిర్మిస్తున్న మైనార్టీ భవన నిర్మాణ పనులకు బుధవారం శంకుస్థాపన చేశారు. అనంతరం అంబేద్కర్ స్టడీసర్కిల్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 60 ఏళ్ల సమైక్య పాలనలో దళితులకు ఒరిగిందేంలేదన్నారు. ఎంపీ వినోద్ సహకారంతో నిర్మించిన బీసీ స్టడీ సర్కిల్‌ను విద్యార్థులు సద్వినియోగం చేసు కోవాలని సూచించారు. నియోజకవర్గంలోని ఆయా మం డలకేంద్రాల్లోని అంబేద్కర్ కమ్యూనిటీ భవనాల్లో గ్రం థాలయాల ఏర్పాటుకు నిధులు మంజూరు చేయాలని సంస్థ చైర్మన్ ఏనుగు రవీందర్‌రెడ్డిని కోరారు. ఇందుకు ఆయన సానుకూలంగా స్పం దించారు. ఈ కార్యక్రమంలో జడ్పీసభ్యుడు ఇప్పనపల్లి సాంబ య్య, ఎంపీపీ గుర్రం భూమారెడ్డి, సీఐ రమేశ్, ఎంపీడీవో సం ధ్యారాణి, అంబేద్కర్ యువజనసంఘం అధ్యక్షుడు కొత్తూరి మహేష్, పట్టణాధ్యక్షుడు శ్రీనివాస్, ఎంపీటీసీలు శ్యాం, స్వప్న, మల్లేశం, రిటైర్ట్ డీఈఓ గోలిపెల్లి మోహన్, మాజీ ఎంపీపీలు వెల్మమల్లారెడ్డి, వల్లాల క్రిష్ణహరి, టీఆర్‌ఎస్ మండలాధ్యక్షుడు మందనర్సయ్య, నాయకులు గడ్డం చుక్కారెడ్డి, కొత్తగంగారెడ్డి, గుర్రం హన్మంతరెడ్డి, గుర్రం ఇంద్రసేనారెడ్డి, గుర్రం హన్మంతరెడ్డి, గొల్లపల్లి శ్రావణ్, గుడిపాటి వెంకటరెడ్డి, ఏనుగు స్వామిరెడ్డి, జహీర్ తదితరులు పాల్గొన్నారు.

139
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles