అమర జవాన్లకు అండగా నిలవాలి

Thu,February 21, 2019 02:54 AM

ముకరంపుర: పుల్వామా ఉగ్రదాడిలో అమరులైన జ వాన్లకు దేశ పౌరులందరూ అండగా నిలవాలని కరీంనగర్ పోలీసు కమిషనర్ కమలాసన్‌రెడ్డి పిలుపునిచ్చా రు. ఉగ్రవాదానికి కుల, మతం లేదనీ ప్రతిఒక్కరూ ఈ దుశ్చర్యను ఖండించాలన్నారు. తెలంగాణ చౌరస్తాలో బుధవారం ఎంఐఎం ఆధ్వర్యంలో కొవ్వొత్తులతో వీరజవాన్లకు నివాళులర్పించారు. అంతకుముందు నగరం లో ర్యాలీ తీశారు. ఈ కార్యక్రమానికి సీపీ హాజరై మా ట్లాడారు. ఉగ్రవాదులు సమస్త మానవావళికి శత్రు వు లని అభివర్ణించారు. అమరులైన జవాన్లలో అన్ని మ తాలకు చెందిన వారు ఉన్నారన్నారు. కులమతాలకతీ దేశ సమగ్రత కాపాడేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని కోరారు. ఈ సందర్భంగా ఎంఐఎం నాయకులు ఉగ్రవాదులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ర్యాలీలో ముందుకునడిచారు.

కార్యక్రమంలో సీఐ దే వారెడ్డి, ఎంఐఎం జిల్లా అధ్యక్షుడు వహజుద్దీన్, ప్రధా న కార్యదర్శి గులాం అహ్మద్ హుస్సేన్, నగర అధ్యక్షుడు మాజీ డిప్యూటి మేయర్ అబ్బాస్ సమీ, నగర కార్యదర్శి సయ్యద్ బర్కత్ ఆలీ, మోహిజుద్దీన్, ఖాద్రీ, లింగంపల్లి శ్రీనివాస్, ఇక్బాల్ హైమద్‌ఖాన్, అజారొద్దీన్, బద్రోద్దీన్, ఎంఐఎం నాయకులు, కార్యకర్తలు పా ల్గొన్నారు. అమర సైనికుల ఆత్మకు శాంతి కలగాలని కాంటినెంటల్ షోటోకాన్ కరాటే డో ఇండియా ఆకాడ మీ ఆధ్వర్యంలో కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించి అమరవీర జవాన్లకు నివాళులర్పించారు. కార్యక్రమంలో శ్రీనివాస్, బండి సంజయ్‌కుమార్ పాల్గొన్నారు.

కరీంనగర్ కల్చరల్: పుల్వామ దాడిలో నేలకొరిగిన వీర జవాన్లు త్యాగం అనిర్వచనీ యమైందని భారత్ స్వా భిమాన్ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు డాక్టర్ ముత్యాల ర మేశ్ కొనియాడారు. భారత్ స్వాభిమాన్, పతంజలి యోగా సమితి ఆధ్వర్యంలో తెలంగాణచౌక్‌లోని జాతీ య జెండా వద్ద అమర జవాన్లకు ఘ నంగా నివాళులర్పించారు. భారత్ స్వాభిమాన్ ముఖ్య సంరక్షకులు బీవీ రావు, పతంజలియోగాసమితి అధ్యక్షుడు బీ లక్ష్మీనారాయణ, యువభారత్ అధ్యక్షుడు కొండా లక్ష్మణ్‌బాబు, ఆర్స్ కళాశాల వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షు డు గందె మహేశ్, గౌరిశెట్టి ట్రస్ట్ అధ్యక్షుడు గౌరిశెట్టి తిరుపతి, భారత్ స్వాభిమాన్, పతంజలి యోగ సమితి బాధ్యులు పెద్ది మారుతి, పైడ శ్రీనివాస్, సీఏ రమేశ్, సత్యనారాయణ, వెంకట్‌రెడ్డి, అన్నపూర్ణ, రాజు, రమణారావు పాల్గొన్నారు.

94
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles