అభివృద్ధి పనులు గుర్తించాలి: ఆర్డీవో

Thu,February 21, 2019 02:53 AM

సైదాపూర్: మండలంలోని ఉమ్మడి వెన్నంపల్లి గ్రామంలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులు గుర్తించాలని అధికారులను ఆర్డీఓ చెన్నయ్య కోరారు. బుధవారం మండలంలోని వెన్నంపల్లి గ్రామంలో సంసద్ ఆదర్శ్‌గ్రామీణ యోజన (సాగి) కింద గతంలో వివిధ శాఖల ద్వారా రూపొందించిన ప్రగతి నివేదికలు ఆయా విభాగాల అధాకారులు చదివి వినిపించారు. ఈ సందర్భంగా ఆర్డీఓ మాట్లాడుతూ సాగి ద్వారా వెన్నంపల్లి, ఆరెపల్లి, లస్మన్నపల్లి గ్రామాల్లో చేపట్టాల్సిన అభివృద్ధి పనులు, గ్రామాల పరిస్థితులపై గతంలో సర్వే చేశారనీ, ఇంకా ఏమైనా అవసరాలుంటే వాటిని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామన్నారు. జడ్పీటీసీ బిల్ల వెంకటరెడ్డి మాట్లాడుతూ సాగిలో వెన్నంపల్లి ఎంపికకు సంబంధించి రాజ్యసభ సభ్యుడు కెప్టెన్ లక్ష్మీకాంతారావుకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్‌లు అబ్బిడి పద్మ, కాయిత రాములు, ఆవునూరి పాపయ్య, తహసీల్దార్ సురేఖ, ఎంపీడీఓ పద్మావతి, ఏపీఎం కుమారస్వామి, ఏపీఓ చిన్నానాయక్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

105
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles