సీనియర్లకు పట్టాభిషేకం

Wed,February 20, 2019 01:57 AM

-అమాత్యులుగా ప్రమాణ స్వీకారం చేసిన ఈటల, కొప్పుల
-రాజేందర్‌కు వైద్య ఆరోగ్యశాఖ, ఈశ్వర్‌కు సంక్షేమ శాఖ కేటాయింపు
-వినయ విధేయతకు పెద్దపీట వేసిన సీఎం కేసీఆర్
-ఉమ్మడి జిల్లాలో హోరెత్తిన సంబురాలు
-పటాకలు కాల్చి, స్వీట్లు పంచుకున్న అభిమానులు
కరీంనగర్ ప్రధాన ప్రతినిధి, నమస్తేతెలంగాణ: మంత్రులు ఈటల రాజేందర్, కొప్పుల ఈశ్వర్ ఉమ్మడి జిల్లాలో ఇతర ఎమ్మెల్యేల కన్నా సీనియర్ నాయకులు. పునర్వ్యవస్థీకరణలో నియోజకవర్గాలు మారినా వారిద్దరూ విజయ పరంపరను కొనసాగిస్తూ వచ్చారు. ఒకటి రెండు సార్లు కాదు, ఏకంగా ఆరు సార్లు ఎమ్మెల్యేలుగా విజయం సాధించి రికార్డులు సృష్టించారు. మంగళవారం వీరిద్దరూ మంత్రులుగా రాజ్‌భవన్‌లో ప్రమాణ స్వీకారం చేశారు.

‘ఈటల’కు వైద్య ఆరోగ్యశాఖ
హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ 2002లో టీఆర్‌ఎస్ పార్టీలో చేరి తన రాజకీయ ప్రస్థానం ఆరంభించారు. 2004 నుంచి 201 వరకు వచ్చిన సాధారణ ఎన్నికలు, ఉప ఎన్నికల్లో వరుసగా ఆరుసార్లు విజయం సాధించారు. 2014 నుంచి 201 వరకు ఆర్థిక పౌరసరఫరాలశాఖ మంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన ఆయన, కేసీఆర్ ఏ బాధ్యత ఇచ్చినా సంపూర్ణంగా నెరవేర్చారు. మంత్రిగా జగిత్యాల, పెద్దపల్లి, కరీంనగర్ జిల్లాలో తిరుగుతూ, ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు విస్తృతంగా కృషి చేశారు. అధికారులకు ఎప్పటికప్పుడు దిశనిర్దేశం చేస్తూ వచ్చారు. అంతేకాదు, ఉద్యమ కాలంలో తాను పార్టీలో చేపట్టిన వివిధ పదవులకు న్యాయం చేయడమేకాకుండా, అధినేత మార్గనిర్దేశనంలో ముందుకు సాగారు. తా జాగా రెండో సారి మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి న ఆయనకు, వైద్య, ఆరోగ్యశాఖ కేటాయించారు.

‘కొప్పుల’కు సంక్షేమ శాఖ..
మొదటిసారి మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన ధర్మపురి ఎమ్మెల్యే కొప్పుల ఈశ్వర్‌కు సుదీర్ఘ రాజకీయ చరిత్రే ఉన్నది. టీఆర్‌ఎస్ ఆవిర్భావం నుంచి పని చేసిన ఆయనకు వివాదరహితుడిగా పేరున్నది. అంతేకాదు, ఆయన కూడా ఆరుసార్లు వరుసగా ఎమ్మెల్యేగా విజయం సాధించి, ఓటమి ఎరగని నేతగా ముద్రవేసుకున్నారు. గత క్యాబినెట్‌లో మంత్రి పదవి వస్తుందని అనుకున్నా, సామాజిక సమీకరణాల నేపథ్యంలో చీప్ విఫ్ ఇచ్చారు. ఆ పదవికి కొప్పుల వన్నె తెచ్చారు. ప్రతిపక్షాలు చేసిన విమర్శలను సమర్థవంతంగా తిప్పికొడుతూ ముందుకుసాగారు. ముఖ్యమంత్రి, ఇతర మంత్రులతో సయోధ్యగా ఉంటూ తన నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసే అంశంపై ఎక్కువగా దృష్టిపెట్టారు. అంతేకాదు, పదవులు వచ్చి నా, రాకపోయినా పార్టీ అధినేత వెంటే నడిచారు. ఈ పరిస్థితుల్లో సుదీర్ఘరాజకీయ ప్రస్థానం, వినయ విధేయతను పరిగణలోకి తీసుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్, తాజాగా మంత్రివర్గంలో మొదటిసారి చోటు కల్పించారు. సంక్షేమ శాఖ బాధ్యతలు అప్పగించారు.

ప్రజల రుణం తీర్చుకుంటాం..
గొప్ప ఆలోచనలు, దార్శనికత ఉన్న సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో ప్రజల రుణం తీర్చుకునేందుకు ఈ పదవిని ఉపయోగిస్తా. నాపై నమ్మకం ఉంచి రెండోసారి మంత్రిగా అవకాశం కల్పించిన ముఖ్యమంవూతికి రుణపడి ఉంటా. అలాగే నాకు వరుస విజయాలు అందిస్తున్న హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజలకు ప్రత్యేక కృతజ్ఞతలు. రాష్ట్రాన్ని ఇప్పటికే అన్ని రంగాల్లో అగ్రగామిలో ముఖ్యమంత్రి తీసుకెళ్తున్నారు. రాష్ట్రం సర్వతో ముఖాభివృద్ధి చెందడానికి మా శాయశక్తులా పనిచేస్తాం. ప్రజల ఆశలు ఆశయాలకు అనుగుణంగా పనిచేసి, బంగారు తెలంగాణ నిర్మాణం చేసి తీరుతాం.
- ఈటల రాజేందర్, వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి

ప్రజల ఆశయాలకు అనుగుణంగా ముందుకు
మంత్రిగా పదవి ప్రమాణస్వీకారం చేయడం చాలా సంతోషంగా ఉంది. నాకు అవకాశం కల్పించిన ముఖ్యమంవూతికి రుణపడి ఉంటా. అలాగే ఆరు సార్లు వరుస విజయాలు ఇచ్చిన నా నియోజకవర్గ ప్రజలకు ప్రత్యేక కృతజ్ఞతలు. తెలంగాణ రాష్ట్రాన్ని ఇప్పటికే అన్ని రంగాల్లో ముఖ్యమంత్రి ముందుకు తీసుకెళ్తున్నారు. బంగారు తెలంగాణ సాధించడానికి సీఎం ఏ బాధ్యతను అప్పగించినా ప్రజల ఆశలు, అశయాలకు అనుగుణంగా పనిచేసి చూపిస్తా. ముఖ్యమంత్రి నమ్మకాన్ని ఆచరణలో నిజంచేసి చూపిస్తా. పదవులు ఎన్ని ఉన్నా.. ప్రజల సంక్షేమమే ప్రధాన ధ్యేయంగా పనిచేస్తా. నా విజయ ప్రస్థానంలో భాగస్వాములైన కార్యకర్తలు, నాయకులు, అన్నివర్గాల ప్రజల రుణం తీర్చుకోవడానికి ఇదో అవకాశంగా భావిస్తున్నా.
- కొప్పుల ఈశ్వర్, సంక్షేమ శాఖా మంత్రి సింగరేణి ఉద్యోగం నుంచి మంత్రి..

పేరు : కొప్పుల ఈశ్వర్
తల్లిదంవూడులు : కొప్పుల లింగయ్య-మల్లమ్మ
పుట్టిన తేదీ : ఏప్రిల్ 20, 1959
స్వస్థలం : కుమ్మరికుంట, జూలపల్లి మండలం, పెద్దపల్లి జిల్లా
వివాహం : 192 జూలై15 (గోదావరిఖని 5ఇంక్లయిన్ కాలనీలో ఆదర్శ వివాహం)
భార్య : స్నేహలత (ఎల్‌ఎమ్ కొప్పుల ట్రస్ట్ అధ్యక్షురాలు)
కూతురు, అల్లుడు : నందిని-అనీల్
మనవడు : భవానీ నిశ్చల్
విద్యార్హత : డిగ్రీ (బీఏ)
ఉద్యోగం : 1976లో సింగరేణి ఉద్యోగంలో చేరి అంచెలంచెలుగా ఎదిగారు. కార్మికనాయకుడిగా కార్మికుల పక్షాన పోరాటం చేస్తూనే రాజకీయాలవైపు ఆకర్శితులయ్యారు.
రాజకీయ జీవితం : 1994లో మేడారం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. 2004 ఎన్నికల్లో మేడారం నుంచి టీఆర్‌ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి సమీప టీటీపీ అభ్యర్థి మాల మల్లేశంపై 56,563 ఓట్ల భారీ మెజారిటీతో ఘన విజయం సాధించారు. 200 తెలంగాణ ఉద్యమం నేపథ్యంలో పార్టీ ఆదేశాల మేరకు పార్టీ శాసన సభ్యత్వానికి రాజీనామాచేశారు. అనంతరం నిర్వహించిన ఉపఎన్నికల్లో పోటీచేసి కాంగ్రెస్ పార్టీ ప్రత్యర్థి కుమారస్వామిపై 2,137 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఇక్కడితో మెడారం అసెంబ్లీ ప్రస్థానం ముగిసింది. 2009లో నియోజకవర్గాల పునర్విభజన జరిగి ధర్మపురి కొత్త నియోజకవర్గంగా ఆవిర్భవించింది. అప్పుడు ఈ నియోజవకర్గం ఎస్సీ రిజర్వ్‌డ్ కావడంతో ఇక్కడి నుంచి కొప్పుల పోటీ చేసి, కాంగ్రెస్ అభ్యర్థి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌పై 1,44 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. 2009 డిసెంబర్ 9న కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటును ప్రకటించి సీమాంధ్ర నాయకుల ఒత్తిడితో యూటర్న్ తీసుకోవడంతో టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలందరూ రాజీనామా చేశారు. అప్పుడు వచ్చిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి లక్ష్మణ్‌కుమార్‌పై 5,91 ఓట్ల భారీ మెజారిటీతో విజయం సాధించారు.

ఇటు తెలంగాణ కోసం పోరాటం చేస్తూనే, అటు నియోజకవర్గ అభివృద్ధికి తీవ్రస్థాయిలో కృషి చేశారు. ఉద్యమ సమయంలో మిలియన్ మార్చ్ సందర్భంగా ట్యాంక్‌బండ్ వద్ద కర్రసాము చేసి అందరి దృష్టినీ ఆకర్శించారు. 2014లో జరిగిన సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి లక్ష్మణ్ కుమార్‌పై 1,679 ఓట్ల మెజారిటీతో తిరిగి ఎమ్మెల్యేగా గెలుపొందారు. అనంతరం చీఫ్‌విప్‌గా పదోన్నతి పొంది నాలుగేళ్లుగా ధర్మపురి నియోజకవర్గాన్ని ప్రగతి పథాన నడిపించారు. 2019 సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి లక్ష్మణ్ కుమార్‌పై 441 ఓట్ల మెజారిటీతో గెలిచి, వరుసగా ఆరోసారి గెలిచిన ఎమ్మెల్యేగా రికార్డు సాధించారు. ఓ వైపు తన తల్లిదండ్రులు లింగయ్య-మల్లమ్మ పేరిట కొప్పుల చారిటబుల్ ట్రస్ట్‌ను స్థాపించి తన భార్య స్నేహలత అధ్యక్షురాలిగా ఎన్నో సేవాకార్యక్రమాలు చేపడుతున్నారు. తాజాగా రాష్ట్ర కేబినెట్‌లో చోటు దక్కించుకున్నారు.

125
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles