పౌర్ణమి జాతరకు పోటెత్తిన భక్తులు

Wed,February 20, 2019 01:43 AM

శంకరపట్నం: పౌర్ణమి జాతర సందర్భంగా మంగళవారం కొత్తగట్టు శ్రీమత్స్యగిరీంవూదస్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. పలు ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో ఆలయ పరిసరాల కిటకిటలాడాయి. శ్రీనీలాదేవి, భూదేవి సమేతుడైన శ్రీమత్స్యగిరీంవూదస్వామిని దర్శించుకొనుటకు భక్తులు బారులు తీరారు. మాఘ శుద్ధ పాడ్యమి రోజున నిర్వహించే విశేష పూజల్లో భాగంగా స్వామి వారిని అర్చకులు ఉదయం సుప్రభాత సేవతో మేల్కొలిపారు. తరువాత నిత్యారాధన, పంచామృతాభిషేకాలు, బాలభోగములు, హవనం, బలిహరణం నిర్వహించారు. మధ్యాహ్నం ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం రాజభోగ నివేదన, రాత్రి గరుడ సేవ నిర్వహించి తీర్థవూపసాద వితరణ చేశారు. ఈ సందర్భంగా భక్తులు కోనేటిలో స్నానం చేశారు. పలువురు మహిళలు గండ దీపం వెలిగించారు. జాతర సందర్భంగా గుట్టపై వెలసిన దుకాణాలు కొనుగోళ్లతో కిటకిటలాడాయి. లింగాపూర్ సర్పంచ్ అంతం వీరాడ్డి భక్తులకు అన్నదానం చేశారు. ఈ సందర్భంగా ఎలాంటి అవాంచనీయ ఘటనలు తలెత్తకుండా కేశవపట్నం, సైదాపూర్ ఎస్‌ఐలు సత్యనారాయణ, శ్రీధర్ ఆధ్వర్యంలో పోలీసు సిబ్బంది పటిష్ట బందోబస్తు నిర్వహించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని వసతులు కల్పించినట్లు ఆలయ ఈఓ వెంకన్న, సర్పంచ్ మొకిరాల కిషన్‌రావు వెల్లడించారు.

151
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles