అంగన్‌వాడీలు అమ్మ ఒడిలాంటివి

Tue,February 19, 2019 01:25 AM

తిమ్మాపూర్, నమస్తే తెలంగాణ: అంగన్‌వాడీ కేం ద్రాలు అమ్మఒడి లాంటివని మానకొండూర్ ఎ మ్మెల్యే రసమయి బాలకిషన్ అభివర్ణించారు. సో మవారం మండలంలోని ఎల్‌ఎండీ కాలనీలోని మహిళా ప్రాంగణంలో అంగన్‌వాడీ టీచర్లతో స మీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భం గా మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ అంగన్‌వాడీ టీచర్లకు గుర్తింపు ఇచ్చి, వారికి జీతాలు పెం చారని చెప్పారు. అలాగే సమస్యల పరిష్కారాని కి చర్యలు తీసుకుంట్నురని పేర్కొన్నారు. అంగన్‌వాడీ కేంద్రాలు గ్రామాల అభివృ ద్ధికి గుండెకాయ లాంటివని, చిన్న పిల్లలకు భరోసా కల్పించే కేంద్రాలన్నారు. సమా జంలో అంగన్‌వాడీ టీచర్ల బాధ్యత గొప్పదన్నారు. అంగన్‌వాడీ టీచర్లు పిల్లలకు నాణ్యమైన విద్యతో పాటు ఆహారం అందిం చి వారిని ఉన్నతులుగా తీర్చిదిద్దాలన్నారు. అన్ని గ్రామాల్లో అంగన్‌వాడీ శాశ్వత భవనాల నిర్మాణాలను కృషి చేస్తానని చెప్పారు. అనంతరం రసమయి బాలకిషన్‌ను అంగన్‌వాడీ టీచర్లు, అధికారులు శాలువాలతో ఘనంగా సన్మానించారు. సిరిసిల్ల, కరీంనగర్ రీజనల్ ఆర్గనైజర్ రేణ, సీడీపీఓ సబిత, సఖి కేంద్రం అడ్వయిజర్ లక్ష్మి, బెజ్జంకి జడ్పీటీసీ తన్నీరు శరత్‌రావు, అంగన్‌వాడీ సూపర్‌వైజర్లు స్వరూప, విజయ, స్వరూపరాణి, బ్లాండీనా, ఇందిర, తిమ్మాపూర్, మానకొండూ ర్, శంకరపట్నం, గన్నేరువరం, చిగురుమామిడి మండలాల అంగన్‌వాడీ టీచర్లు పాల్గొన్నారు.

120
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles