కొత్త పింఛన్లకు కసరత్తు

Mon,February 18, 2019 12:40 AM

-గ్రామాల్లో మొదలైన క్షేత్రస్థాయి సర్వే
-57 నుంచి 64 ఏళ్ల మధ్య వయస్సువారి గుర్తింపు
-ఇప్పటికే ఓటరు జాబితా ఆధారంగా వివరాల సేకరణ
-14,494 మంది ఉంటారని అంచనా
-గ్రామ సభల్లో ఎంపిక విధానం
-ఏప్రిల్ నుంచే కొత్తవారికి ఆసరా
- పారదర్శకంగా ఎంపిక : డీఆర్‌డీఓ
కరీంనగర్ ప్రతినిధి, నమస్తే తెలంగాణ: ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికల హామీ మేరకు 57 ఏండ్లు నిండినవారందరికీ ఆసరా పింఛన్లు అం దించేందుకు జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే ఓటరు జాబి తా ఆధారంగా 57 ఏండ్ల నుంచి 64 ఏండ్ల మధ్య వయస్సున్న వారి వివరాలు సేకరించారు. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి వీరికి ఆసరా పింఛన్లు అం దించాలని సర్కారు ఆదేశించిన నేపథ్యంలో అ ర్హులను గుర్తించే పనిలో అధికారులు నిమగ్నమ య్యారు. ఓటరు జాబితా ప్రకారం 14,494 మం ది కొత్తవారు పింఛన్లు పొందేందుకు అర్హులని గుర్తించారు.

వృద్ధులకు కొండంత అండగా..
తెలంగాణ సర్కారు ఆసరా పింఛన్లు అందిస్తూ వృ ద్ధులకు కొండంత అండగా నిలుస్తున్నది. ఇప్పటి దాకా 65 ఏండ్లు ఉన్నవారికి పింఛన్లు ఇచ్చేవా రు. కాగా గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా 57 ఏండ్లు నిండినవారికి పింఛన్లు మంజూరు చేస్తా మని కేసీఆర్ హామీ ఇవ్వడమే కాకుండా టీఆర్ ఎస్ ఎన్నికల మెనిఫెస్టోలో పొందుపరిచారు. అదేవిధంగా పింఛన్ల మొత్తాన్ని రెట్టింపు చేశారు. అర్హులను ఎంపిక చేసే బాధ్యతను సర్కారు గ్రా మీణాభివృద్ధి శాఖకు అప్పగించింది. ఈ నేప థ్యం లో సంబంధిత అధికారులు గతేడాది నవంబర్ 19 వరకు ఉన్న ఓటరు జాబితా ఆధారంగా 57 ఏండ్లు నిండిన వారు జిల్లాలో 61,110 మంది ఉన్నారనీ, ఇందులో పింఛన్లు పొందేందుకు 14,494 మంది అర్హులని ప్రాథమికంగా అంచనాకు వచ్చారు. ప్రభుత్వం ఆదేశించిన వెంటనే గ్రామ సభలు నిర్వహించి అర్హులను ఎంపిక చేస్తామని డీఆర్‌డీఓ ఏ వెంకటేశ్వర్ రావు తెలిపారు.

దండిగా ఆసరా..
జిల్లాలో ఆసరా పింఛన్లు గణనీయంగా పెరగనున్నాయి. ఇప్పటి వరకు 48,918 మంది వృద్ధు లు, 34,229 మంది వితంతువులు, 20,702 మంది వికలాంగులు, 2,817 మంది చేనేత, 3,767 మంది గీత, 9,337 మంది బీడీ, 3,271 మంది ఒంటరి మహిళలు మొత్తం 1,23,041 మంది పింఛన్లు తీసుకుంటున్నారు. వీరిలో వికలాంగుకుల ప్రతి నెల ఒక్కొక్కరికి రూ. 1,500 చొప్పున రూ. 3.10 కోట్లు, మిగతా లబ్ధిదారుల కు రూ. 10.23 కోట్ల చొప్పున మొత్తం 13.33 కోట్ల పింఛన్లు పంపిణీ చేస్తున్నారు. అలాగే 579 మంది హెచ్‌ఐవీ రోగులకు ఒక్కొక్కరికి నెలకు రూ. వెయ్యి చొప్పున రూ. 57,900 చొప్పున అందిస్తున్నారు. వచ్చే ఏప్రిల్ నుంచి ఈ మొత్తం రెట్టింపు కానున్నది. 57 ఏండ్ల వృద్ధులను కూడా ఆసరా పింఛన్లు మంజూరు చేస్తే పెద్దసంఖ్యలో లబ్ధి చేకూరనుంది. ఏప్రిల్ నుంచి వచ్చే పింఛన్ల వివరాలు పరిశీలిస్తే 20,702 మంది ఉన్న వికలాంగులకు నెలకు రూ. 3,016 చొప్పున 6.24 కోట్లు, 1,02,339 మంది ఇతర పింఛన్ల లబ్ధిదారులకు రూ. 20.63 కోట్లు కలిపి 29.79 కోట్లు ప్రతి నెలా జిల్లాకు లబ్ధి చేకూరనుంది. ఇక హెచ్‌ఐవీ రోగులకు కూడా నెలకు రూ. 2,016 పంపిణీ చేస్తే 1.15 లక్షలకు చేరుకుంటుంది. 57 ఏండ్లు ఉన్న 14,494 మంది కూడా కొత్తగా పింఛన్లు మంజూరైతే రూ. 2.92 కోట్లు అందనున్నాయి..

పారదర్శకంగా ఎంపిక..
వృద్ధాప్య పింఛన్ల కోసం గ్రామీణాభివృద్ధి అధికారులే ఎంపిక చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 14, 494 మంది అర్హులు ఉంటారని ప్రాథమిక అంచనాకు వచ్చారు. ప్రభుత్వం ఆదేశించిన వెంటనే వీరిలో అర్హులను ఎంపిక చేసేందుకు గ్రామ సభ లు నిర్వహిస్తారు. ప్రస్తుతం గ్రామీణాభివృద్ధి అధికారులు ఎంపిక చేసిన పేర్లను గ్రామ సభల్లో చది వి వినిపిస్తారు. వీరిలో అర్హులెవరనేది అక్కడే తేలనుంది. ఓటరు జాబితాలో లేని వారిని కూడా గ్రా మ సభల్లో గుర్తించే అవకాశం ఉంది. అంటే అర్హులైన వారిని అప్పటికపుడే ఎంపిక చేయనున్నారు. ఈ లెక్కన అధికారులు ప్రాథమికంగా గుర్తించిన అర్హుల్లో మరింత మంది పెరగవచ్చు. లేదంటే త గ్గనూ వచ్చు. అధికారులు గ్రామాలు, మండలాల వారిగా ఎంపిక చేసిన జాబితాను సిద్ధం చేసుకున్నారు. ప్రభుత్వ ఆదేశాలు రాగానే కొత్తగా ఎన్ని కైన సర్పంచుల అధ్యక్షతన గ్రామ సభలు నిర్వహించి లబ్ధిదారులను ఎంపిక చేయనున్నారు..

354
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles