జంగపెల్లిలో వృద్ధుడి దారుణ హత్య

Mon,February 18, 2019 12:38 AM

గన్నేరువరం: మండలంలోని జంగపెల్లి గ్రామానికి చెందిన అనుమండ్ల మల్లయ్య (65) దారుణ హత్యకు గురయ్యాడు. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. అనుమండ్ల మల్లయ్య ఆదివారం సాయంత్రం వ్యవసాయ బావి వద్దకు వెళ్లాడు. కాగా గుర్తు తెలియని వ్యక్తులు మల్లయ్య తలపై కర్రలతో బాధడంతో తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. పొలంలో రక్తపు మడుగులో పడి ఉండగా, పక్కనే ఉన్న దారి వెంట వచ్చి పోయే వారు గమనించి కుటుంబ సభ్యులకు, గ్రామస్తులకు సమాచారం అందించారు. వచ్చి చూసే సరికి మృతి చెంది ఉన్నాడు. సర్పంచ్ అటికం శారద, ఎంపీటీసీ అనుమండ్ల మల్లేశంలు పోలీసులకు సమాచారం ఇచ్చారు. తిమ్మాపూర్ సర్కిల్ సీఐ కరుణాకర్‌రావు, గన్నేరువరం ఎస్‌ఐ వంశీకృష్ణ, ఎల్‌ఎండీ ఎస్‌ఐ నరేశ్‌రెడ్డిలు సంఘటన స్థలానికి చేరుకొని, హత్య జరిగిన తీరును పరిశీలించారు. నిందితులను పట్టుకోవడానికి పోలీస్ జాగిలాన్ని రప్పించారు. జాగిలం తిమ్మాపూర్ మండలం జాగుండ్ల వైపు కొంత దూరం వెళ్లి ఆగిపోయింది. కాగా హత్యకు భూకక్షలే కారణమై ఉంటుందనీ, నిందితులను త్వరలోనే పట్టుకుంటామని సీఐ వెల్లడించారు. మృతదేహాన్ని జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ దవాఖానకు తరలించారు. మల్లయ్య భార్య గతంలోనే మృతిచెందగా, కుమారుడు అంజయ్య ఉన్నాడు. అంజయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

173
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles