నిర్లక్ష్యం చేసిన కాంట్రాక్టర్లపై చర్యలు

Sun,February 17, 2019 02:21 AM

కార్పొరేషన్, నమస్తే తెలంగాణ: నగరంలో అభివృద్ధ్ది పనులను దక్కించుకుని నిర్లక్ష్యం చేస్తున్న కాంట్రాక్టర్లకు నో టీసులు జారీ చేసి బ్లాక్ లిస్టులో పెడుతామని నగర మే యర్ రవీందర్ సింగ్ హెచ్చరించారు. శనివారం స్థానిక ఫిల్టర్‌బెడ్ వద్ద చేపడుతున్న భగీరథ పార్కు పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పనులు పెండింగ్‌లో పెట్టిన కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకోవడంతో పాటు అవసరమైతే టెండర్లను రద్దుకు వెను కాడబోమన్నారు. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసే గుత్తెదారులపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించా రు. రాష్ట్ర ప్రభుత్వం మం జూరు చేసిన నిధులతో చేప ట్టే అన్ని పనులకు టెండర్లు నిర్వహణ పూర్తి చేశామన్నా రు. అయితే పలువురు కాంట్రాక్టర్లు పనులు చేయకుం డా అలసత్వం చూపుతున్నారని చెప్పారు. పనుల్లో నాణ్యత పాటించని కాంట్రాక్టర్లకు నోటీసులు జారీ చేయాలని అధికారులను ఆదేశించారు. గ్రూపులుగా ఏర్పాటై పనులు చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే పనులు ప్రారంభించాలనీ, లేదంటే బాధ్యులకు నోటీసులివ్వాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఈ భద్రయ్య, కార్పొరేటర్ రవీందర్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

150
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles