ఎంసీహెచ్‌లో నాలుగున్నర కిలోల శిశువు జననం

Sat,February 16, 2019 01:39 AM

కరీంనగర్ హెల్త్ : జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ దవాఖానలో గల మాతా శిశు ఆరోగ్య కేం ద్రంలో శుక్రవారం ఓ మహిళ నాలుగున్నర కిలోల శిశువుకు జన్మనిచ్చింది. దవాఖానా సూపరింటెండెంట్ డాక్టర్ అజయ్‌కుమార్ వివరాలు వెల్లడించారు. గంగాధర మండలం కాచారం గ్రామానికి చెందిన మమత పురిటి నొప్పులతో బాధపడుతూ గురువారం మ ధ్యాహ్నం మాతా శిశు ఆరోగ్య కేంద్రానికి వ చ్చింది. పరీక్షించిన వైద్యులు శుక్రవారం మ ధ్యాహ్నం శస్త్ర చికిత్స చేసి నాలుగున్నర కిలోల శిశువును బయటికి తీశారు. శిశువు ఆరోగ్యంగానే ఉన్నట్లు తెలిపారు. ఇంత బరువు గల శిశువు ఇక్కడ జన్మించడం ఇదే మొదటిసారని ఆయన తెలిపారు. తల్లి, శిశువు ఆరోగ్యంగానే ఉన్నారు. శస్త్ర చికిత్స చేసిన వైద్యులు అనసూ య, గంగాధర్, స్టాప్ నర్సు మాధ ఉన్నా రు. ప్రైవేట్ దవాఖానాలో కాన్పు అయితే వేల రూ పాయల ఖర్చేయ్యేదని, ఇప్పుడు నయా పైసా ఖర్చు లేకుండా శస్త్ర చికిత్స చేసిన వైద్యులకు మమత కుటుంబీకులు కృతజ్ఞతలు తెలిపారు.

112
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles