ప్రతి గింజా కొనుగోలు చేస్తాం

Thu,February 14, 2019 01:16 AM

-జిల్లా మార్క్‌ఫెడ్ అధికారి శ్యాంకుమార్
-మార్క్‌ఫెడ్ కందుల కొనుగోలు కేంద్రం పరిశీలన
గంగాధర: కంది రైతులు ఆందోళన చెందవద్దనీ, ప్రతి గింజను కొనుగోలు చేస్తామని జిల్లా మార్క్‌ఫెడ్ అధికారి శ్యాంకుమార్ పేర్కొన్నారు. బుధవారం గంగాధర వ్యవసాయ మార్కెట్ ఆవరణలో మార్క్‌ఫెడ్ కందుల కొనుగోలు కేంద్రాన్ని బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు ఇంటి వద్దనే కందులను ఆరబోసుకొని, చెత్తాచెదారం లేకుండా నాణ్యమైన సరుకు తీసుకువచ్చి మద్దతు ధర పొందాలని సూచించారు. గత రెండు రోజులుగా వాతావరణంలో వచ్చిన మార్పులతో కందుల్లో తేమశాతం పెరుగుతున్న దృష్ట్యా రైతులు వాటిని ఆరబోసుకోవాలన్నారు. గంగాధర కొనుగోలు కేంద్రంలో లక్ష్యానికి మించి కందులు కొనుగోలు చేస్తామన్నారు. జిల్లా వ్యాప్తంగా 5 వేల మెట్రిక్ టన్నుల కొనుగోలు లక్ష్యం కాగా.. ఇప్పటికే 3 వేల మెట్రిక్ టన్నుల కొనుగోలు పూర్తయిందనీ, మిగతావి త్వరలోనే పూర్తి చేస్తామన్నారు. ఆయన వెంట డీసీఎంఎస్ మేనేజర్ వెంకటేశ్వర్లు, స్థానిక మార్క్‌ఫెడ్ సిబ్బంది, రైతులు ఉన్నారు.

110
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles