తార్కిక అధ్యయనంతోనే సంపూర్ణ పరిజ్ఞానం

Tue,February 12, 2019 12:45 AM

తిమ్మాపూర్, నమస్తే తెలంగాణ : విద్యార్థులు బట్టిపట్టే విధానాన్ని మానుకొని, విషయాన్ని అర్థం చేసుకుని చదవడం ద్వారా సత్ఫలితాలు సాధించవచ్చని ట్రాన్స్‌కో సూపరింటెండెంట్ ఇంజినీర్ ఎన్ శ్రీనివాస్ తెలిపారు. మండలంలోని జ్యోతిష్మతి ఇంజినీరింగ్ కళాశాలలో పాలిటెక్నిక్ చదువుతున్న విద్యార్థులకు లీనియర్ వేరియబుల్ పవర్ సైప్లె అంశంపై రెండు రోజుల జాతీయ సదస్సు సోమవారం ప్రారంభమైంది. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా ట్రాన్స్‌కో సూపరింటెండెంట్ ఇంజినీర్ ఎన్ శ్రీనివాస్ హాజరై జ్యోతి ప్రజ్వలన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులు అప్లికేషన్ నాలెడ్జ్‌ను పెంచుకోవాలన్నారు. ఎందుకు, ఏమిటి, ఎలా అన్న ప్రశ్నలతో ప్రతి విషయాన్ని తార్కికంగా అధ్యయనం చేయాలనీ, తద్వారా సంపూర్ణ పరిజ్ఞానాన్ని పొందుతామని తెలిపారు. ట్రాన్స్‌కో డివిజనల్ ఇంజినీర్ ఎన్ రమేశ్‌కుమార్ మాట్లాడుతూ విద్యార్థులు సమయాన్ని వృథా చేయకుండా, దాన్ని నాలెడ్జ్ పెంచుకోవడానికి ఉపయోగించుకోవాలని సూచించారు. కళాశాల చైర్మన్ జువ్వాడి సాగర్‌రావు, డైరెక్టర్ కే వెంకట్రావ్, ప్రిన్సిపాల్ డాక్టర్ జీ లక్ష్మీనారాయణరావులు మాట్లాడుతూ శిక్షణ సదస్సులను ఉపయోగించుకుని అకాడమిక్‌లో మంచి ఉత్తీర్ణత సాధించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో డిప్లొమా ఇన్‌చార్జి సీహెచ్ సజన్‌రావు, పాలిటెక్నిక్ ఎలక్ట్రికల్ హెచ్‌ఓడీ బొద్దుల బాబు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

203
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles