గిరిజన తండాల్లో హైమాస్ట్ వెలుగులు

Tue,February 12, 2019 12:44 AM

కొడిమ్యాల: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గిరిజన తాండాల్లో హైమాస్ట్ వెలుగులు పల్లెల్లో కాంతులు విరజిమ్ముతున్నాయని చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ అన్నారు. మండలంలోని సూరంపేట, గం గారాం తాండ, కోనాపూర్,హిమ్మత్‌రావుపేట, నాచుపల్లి, నల్లగొండ గ్రామాల్లో 12 లక్షలు కరీంనగర్ ఎంపీ బోయిన్‌పల్లి వినోద్‌కుమార్ నిధులతో హైమాస్ట్ లైట్లను ఏర్పాటు చేయగా సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తండాల్లో హైమాస్ట్ వెలుగు విరజిమ్ముతు న్నట్లు చెప్పారు. గ్రామాల అభివృద్ధికి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక నిధులు కేటాయించినట్లు చెప్పారు. రాత్రి పూట ప్రజలకు ఏలాంటి అవస్థలు ఉండకూడదనే ఉద్దేశంతో హైమాస్ట్ లైట్లను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. స్వరాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి ముఖ్యమంత్రి కేసీఆర్ పేద్దపీట వేస్తున్నట్లు చెప్పారు. అంతకు ముందు సూరంపేట, గంగారాంతండా, కోనాపూర్ గ్రామాల్లో హైమాస్ట్ లైట్లను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచులు పునుగోటి కృష్ణారావు, బొజ్జానాయక్, దర్శనాల కౌసల్య, స్వామిరెడ్డి, టీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకులు మేన్నేని రాజనర్సింగరావు, తదితరులు ఉన్నారు.

95
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles