‘తొలి’ విడత ప్రశాంతం 84.22% పోలింగ్

Tue,January 22, 2019 02:26 AM

-ఐదు మండలాల పరిధిలో వెల్లువెత్తిన ఓటర్లు
-ఉదయం 7 గంటల నుంచే బారులు
-ఓటు హక్కు వినియోగించుకున్నది : 1,34,893
-పురుషులు : 65,290 (81.79శాతం)..
-మహిళలు : 69,603 (86.63 శాతం)
-అతివలదే ఆధిక్యం
-నల్లగుంటపల్లిలో అత్యధికంగా 96.24శాతం ఓటింగ్
-చింతకుంటలో అత్యల్పంగా 69.36శాతం..
-బూర్గుపల్లిలో ఓటు వేసిన ఎమ్మెల్యే సుంకె దంపతులు
-బొమ్మకల్ వెయ్యి మందికిపైగా వైద్య విద్యార్థులు..
-కేంద్రాలను పరిశీలించిన ఎలక్షన్ అబ్జర్వర్ భారతిలక్పతి నాయక్, సీపీ కమలాసన్

కరీంనగర్ ప్రతినిధి, నమస్తే తెలంగాణ: మొదటి విడత పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. సోమవారం ఐదు మండలాల పరిధిలో ఎన్నికలు జరిగాయి. ఏకగ్రీవమైన 4 సర్పంచ్, 200వార్డులు పోను.. మిగతా 93 సర్పంచ్ స్థానాలు, 728 వార్డు స్థానాలకు ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ నిర్వహించారు. ఈ సారి గ్రామీణులు తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఉత్సాహం చూపారు. ఉదయం ఏడు గంటల నుంచే ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద ఓటర్లు బారులు తీరారు. కొత్తగా ఓటు హక్కు నమోదు చేసుకున్న యువతీ యువకుల నుంచి పండు ముసలి వరకు పోటెత్తారు. మొత్తం 1,60,162 మంది ఓటర్లకు గాను 1,34,893 (84.22శాతం) తమ ఓటు వేశారు. అత్యధికంగా చొప్పదండిలో 87.19 శాతం, అత్యల్పంగా కొత్తపల్లి మండలంలో 81.24 శాతం మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. షెడ్యూ లు ప్రకారం ఎన్నికలు ముగిసిన తర్వాత మ ధ్యాహ్నం 2గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభించారు. ముందుగా వార్డు స్థానాల్లో, ఆ తర్వాత సర్పంచు స్థానాలకు ఓట్ల లెక్కింపు నిర్వహించారు. చిన్న పంచాయతీల్లో సాయంత్రం 5 గం టల నుంచే ఎన్నికల ఫలితాలను ప్రకటించారు. గంగాధర మండలం ఒద్యారంలో పోలింగ్ కేంద్రాన్ని రాష్ట్ర ఎన్నికల పరిశీలకురాలు భారతి లక్ నాయక్, మధురానగర్ జడ్పీ సీఈవో వెంకటమాధవరారు, గంగాధరతోపాటు రామడుగు మండలం వెలిచాలలో సీపీ వీబీ కమలాసన్ రెడ్డి, గంగాధరలో డీసీపీ అడ్మిన్ శ్రీనివాస్, ఆర్డీవో ఆనంద్ పరిశీలించారు. మొత్తంగా తొలి విడత ఎన్నికలు ప్రశాంతంగా ముగియడంలో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.

అత్యధికంగా మహిళలే..
ఓటు హక్కును వినియోగించుకున్న వారిలో మహిళలే ఎక్కువగా ఉన్నారు. 79,819 మంది పురుషులు, 80,342 మంది మహిళలు ఓటర్లుగా నమోదై ఉన్నారు. ఇందులో 65,290 (81.79 శాతం) మంది పురుషులు, 69,603 (86.63 శాతం) మంది మహిళలు తమ ఓటు వేశారు. 4,313 మంది అతివలే ఎక్కువగా ఓటు హక్కు వినియోగించుకున్నారు.
వెల్లువెత్తిన ఓటరు చైతన్యం..
తొలి విడతలో ఓటరు చైతన్యం వెల్లువెత్తింది. అన్ని గ్రామాల్లో ఓటోత్సాహం కనిపించింది. ఏ గ్రామంలో చూసినా 75 శాతానికి తక్కువ కా కుండా పోలింగ్ నమోదైంది. అత్యధికంగా కరీంనగర్ మండలం నల్లగుంటపల్లిలో 96.24శాతం, అత్యల్పంగా కొత్తపల్లి మండలం చింతకుంటలో 69.36శాతం రికాైర్డెంది. నల్లగుంటపల్లిలో 426 మందికి 410 మంది.. చింతకుంటలో 6,073 మందికి 4,212 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. కరీంనగర్ రూరల్ మండలం తాహెర్ కొండాపూర్ 95.51, దుబ్బపల్లిలో 94.15 శాతం పోలింగ్ నమోదు కాగా, మరో రెండు గ్రామాల్లో 92శాతం, ఎనిమిది గ్రామాల్లో 84శాతం, రెండు గ్రామాల్లో 74 శాతానికిపైగా పోలింగ్ జరిగింది.
-గంగాధర మండలం కొండన్నపల్లిలో 92శాతం, గోపాల్ 90 శాతం పోలింగ్ నమోదయ్యింది. ఇదే మండలంలోని మరో మూడు గ్రామాల్లో 88, ఐదు గ్రామాల్లో 85, 7 గ్రామాల్లో 80, 8 గ్రామాల్లో 75 శాతానికిపైగా పోలింగ్ నమోదైంది.
-చొప్పదండి మండలం సాంబయ్యపల్లిలో 91, వెదురుగట్టలో 90 శాతానికిపైగా పోలింగ్ జరిగింది. ఈ మండలంలో నాలుగు గ్రామాల్లో 89, ఏడు గ్రామాల్లో 86, రెండు గ్రామాల్లో 83, ఒక గ్రామంలో 82 శాతానికిపైగా పోలింగ్ జరిగింది.
-రామడుగు మండలంలోని కొక్కెరకుంటలో అత్యధికంగా కొక్కెరకుంటలో 92, షానగర్ 90 శాతం పోలింగ్ జరిగింది. మరో మూడు గ్రామాల్లో 88, ఒక గ్రామంలో 87, 3 గ్రామాల్లో 86, 6 గ్రామాల్లో 85, 2 గ్రామాల్లో 84, 3 గ్రామాల్లో 83 శాతానికిపైగా పోలింగ్ జరిగింది.
-కొత్తపల్లి మండలంలో అత్యధికంగా ఖాజీపూర్ 88.96 శాతం పోలింగ్ జరిగింది. ఈ మండలంలో 2 గ్రామాల్లో 87, 3 గ్రామాల్లో 84 ఒక గ్రామంలో 78 మరో గ్రామంలో 69 శాతం పోలింగ్ జరిగింది. ఉదయం 11.00 గంటల వరకే 50 శాతానికిపైగా.. తర్వాత మరో 2 గంటల్లో మరో 50 శాతం పోలింగ్ నమోదైంది.

261
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles