ఘనంగా లయన్స్‌క్లబ్ రీజియన్ మీట్

Mon,January 21, 2019 01:23 AM

కరీంనగర్ కల్చరల్: లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ జినవల్లభ రీజియన్ మీట్‌ను ఆదివారం సాయంత్రం స్థానిక కొండ సత్యలక్ష్మీగార్డెన్స్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ మీట్‌కు చైర్మన్ హన్మాండ్ల రాజిరెడ్డి సభాధ్యక్షత వహించగా, ముఖ్య అతిథులుగా ప్రముఖ మోటివేటర్ గొట్టిపాటి సత్యవాణి, జిల్లా గవర్నర్ అనంతుల శివప్రసాద్ హాజరై, జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడారు. సమాజ సేవలో క్లబ్ బాధ్యులు ముందుంటారని కొనియాడారు. లయన్స్ క్లబ్ ఆఫ్ కాళేశ్వరీ, లయన్స్ క్లబ్ ఆఫ్ కరీంనగర్ ప్రథమ, ద్వితీయ అవార్డులు అందుకున్నారు. చిన్నారుల సంస్కాతిక నృత్యాలు అలరించాయి. క్లబ్ బాధ్యులు వేణుమూర్తి, సురేశ్, మల్లారెడ్డి, రాజేంద్రప్రపాద్, వెంకటేశ్వర్లు, సంతోష్‌రెడ్డి, పవన్‌కుమార్, సంతోష్, నారాయణరెడ్డి, విజయ, శ్రీనివాస్‌రెడ్డి పాల్గొన్నారు.

154
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles