హెల్మెట్ బరువు కాదు.. బాధ్యత

Sat,January 19, 2019 12:41 AM

కరీంనగర్ క్రైం: ‘హెల్మెట్ బరువు కాదు.. బాధ్యత..’ అంటూ హెల్మెట్ వినియోగంపై అవగాహన కల్పిస్తూ శుక్రవారం పోలీస్ ఎల్ అండ్ టీ కన్ సంయుక్తంగా నగరంలో ద్విచక్ర వాహన ర్యాలీ నిర్వహించారు. సీపీ కమలాసన్ హెల్మెట్ ధరించి, స్వయంగా ద్విచక్ర వాహనం నడుపుతూ ర్యాలీలో పాల్గొన్నారు. కమిషనరేట్ కేంద్రం నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీ బస్టాండ్ ఇన్ తెలంగాణచౌక్, ఐబీ చౌరస్తా, కోర్టు చౌరస్తా, మంచిర్యాల చౌరస్తా, గాంధీ విగ్రహం, రాజీవ్ తెలంగాణ అమరవీరుల స్తూపం, తెలంగాణ తల్లి విగ్రహం, బస్టాండ్ మీదుగా పోలీస్ హెడ్ క్వార్టర్స్ చేరుకుంది. ఈ సందర్భంగా తెలంగాణ చౌక్ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీపీ మాట్లాడుతూ, ప్రతి ద్విచక్ర వాహనదారుడు ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి హెల్మెట్ ధరించాలని సూచించారు. హెల్మెట్ ధరించడం తమ ప్రాణాల రక్షణకే అని గుర్తించాలని సూచించారు. హెల్మెట్ ధరించకపోవడంవల్లే 90 శాతం ప్రమాదాల్లో తలకు బలమైన గాయాలై మృత్యువాత పడుతున్నారని పేర్కొన్నారు. ప్రతి ఏటా దేశవ్యాప్తంగా జరుగుతున్న 5 లక్షల ప్రమాదాల్లో 5.5 లక్షల మంది గాయపడుతుండగా 1.5 లక్షల మంది మృతి చెందుతున్నారని పేర్కొన్నారు. హెల్మెట్ ధరించి వాహనాలు నడిపితే రోడ్డు ప్రమాదాల్లో 90 శాతం మంది ప్రాణాలు కాపాడుకోవచ్చని సూచించారు. హెల్మెట్ ధరించడాన్ని భారంగా భావించకుండా ప్రాణాల రక్షణ కోసమేనని గుర్తించాలని చెప్పారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించడం, ఇతర పెద్ద వాహనాల్లో ప్రయాణించే వారు సీటు బెల్టును ధరించడం వల్ల రోడ్డు ప్రమాదాల్లో మరణాల శాతాన్ని గణనీయంగా తగ్గించవచ్చన్నారు. నెల నుంచి కమిషనరేట్ వ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. ఐఎస్ బ్రాండ్ ఉన్న హెల్మెట్లనే ధరించాలని సూచించారు. అడిషనల్ డీసీపీ శ్రీనివాస్, ఏసీపీలు డాక్టర్ అశోక్, శ్యాంసుందర్, ఇన్స్ సీతారెడ్డి, శ్రీలత, తుల శ్రీనివాస్ దేవారెడ్డి, విజయ్ బీ రవి, ఎల్ కన్ మేనేజర్ చంద్రశేఖర్, సెక్షన్ ఇన్ ఎస్ బాలు, సేఫ్టీ ఇన్ సద్దాంతోపాటు పోలీసులు పాల్గొన్నారు.

321
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles