ఏకగ్రీవం.. అభివృద్ధికి సోపానం

Fri,January 18, 2019 01:13 AM

తిమ్మాపూర్, నమస్తే తెలంగాణ: తిమ్మాపూర్ మండలం పర్లపల్లి, రాంహనుమాన్‌నగర్ సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. రెండో విడత పంచాయతీ ఎన్నికల్లో భాగంగా గురువారం నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ అనంతరం పర్లపల్లి సర్పంచ్‌గా మాదాడి భారతి, రాంహనుమాన్‌నగర్ సర్పంచ్‌గా యాదగిరి వెంకటేశ్వర్‌రావును అధికారులు ప్రకటించారు. అలాగే రాంహనుమాన్‌నగర్ వార్డు సభ్యులుగా పల్లె నర్సింహారెడ్డి, కర్ణకంటి శ్రీనివాస్, లెంకల శ్రీధర్‌రెడ్డి, అల్లెపు ఎల్లవ్వ, ఉప్పులేటి రాజమల్లవ్వ, పల్లె సరోజన ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కాగా రాంహనుమాన్‌నగర్ సర్పంచ్‌గా ఏకగ్రీవంగా ఎన్నికైన వెంకటేశ్వర్‌రావు, వార్డు సభ్యులకు గ్రామస్తులు స్వీట్లు తినిపించి సంబురాలు చేసుకున్నారు.

గన్నేరువరం మండలంలో..
గన్నేరువరం: మండలంలోని సాంబయ్యపల్లి, గోపాల్‌పూర్ గ్రామ పంచాయతీల సర్పంచ్, వార్డు స్థానాలకు ఒక్కో నామినేషన్ మాత్రమే వచ్చాయి. గురువారం నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో రెండు గ్రామాల సర్పంచులు, వార్డు సభ్యులను అధికారులు ప్రకటించారు. సాంబయ్యపల్లి సర్పంచ్‌గా చింతలపెల్లి నర్సింహారెడ్డి, గోపాల్‌పూర్ సర్పంచ్‌గా చెన్నాల నగేష్ ఎన్నికయ్యారు. కాగా సాంబయ్యపల్లి వార్డు సభ్యులుగా గొడుగు తిరుపతి, గడ్డం సరోజన, గడ్డం లత, గడ్డం ఉదయ్‌కుమార్ రెడ్డి, జీల గౌరవ్వ, నూకల రమణ, జీల వజ్రమ్మ, అన్నాడి భగవాన్‌రెడ్డి, గోపాల్‌పూర్ వార్డు సభ్యులుగా జెల్ల రాజేశ్వరీ, బరిగెల సత్య, గాజె నర్సింహా స్వామి, ఆకుల స్వామి, రాకం భాగ్యలక్ష్మి, గొంటి అనిల్, గొంటి స్రవంతి, కొంపెల్లి శ్రీనివాస్ ఎన్నికయ్యారు. కాగా సర్పంచ్, వార్డు సభ్యులకు అధికారులు శుక్రవారం ధ్రువీకరణ పత్రాలు అందజేయనున్నారు.

425
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles