వేగంగా ఐటీ టవర్ నిర్మాణం

Sun,January 13, 2019 01:37 AM

-నగరానికి ఐటీ కంపెనీలు తీసుకువస్తాం
-స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు మెరుగు పరుస్తాం
-కరీంనగర్ ఎంపీ వినోద్
-ఎమ్మెల్యే గంగులతో కలిసి పనుల పరిశీలన
కార్పొరేషన్, నమస్తే తెలంగాణ: కరీంనగర్ చేపట్టిన ఐటీ టవర్ నిర్మాణాన్ని వేగంగా పూర్తి చేయించి అందులో కంపెనీలు కార్యకలాపాలు ప్రారంభించేలా చర్యలు తీసుకుంటున్నామని ఎంపీ వినోద్ పేర్కొన్నారు. శనివారం ఐటీ టవర్ నిర్మాణ పనులను ఎమ్మెల్యే గంగుల కమలాకర్ కలిసి పరిశీలించారు. అక్కడ జరుగుతున్న పనులను అధికారులు, కాంట్రాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. త్వరలోనే విదేశాల్లో పర్యటించి ఐటీ కంపెనీలను ఇక్కడికి తీసుకువచ్చేందుకు కృషి చేస్తామన్నారు. ఐటీ టవర్ ఇప్పటికే ఐదో అంతస్తు పూర్తి కావస్తున్నదనీ, మిగతా పనులను కూడ పూర్తి చేసి దీనిని వేగంగా వినియోగంలోకి తీసుకువస్తామన్నారు. దీని ద్వారా స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు కృషి చేస్తామన్నారు.
మానేరు రివర్ ఫ్రంట్ పనులకు డీపీఆర్
మానేరు రివర్ ఫ్రంట్ పనులకు కూడ గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రి కేసీఆర్ రూ.500 కోట్ల నిధులు ఇచ్చారని ఎంపీ వినోద్ గుర్తుచేశారు. దీనికి సంబంధించి పనులపై పూర్తిస్థాయిలో డీపీఆర్ సిద్ధం అవుతున్నదని తెలిపారు. అనంతరం ఈ పనులు కూడ పూర్తయితే కరీంనగర్ అద్భుతంగా మారుతుందన్నారు. జిల్లా అభివృద్ధి లక్ష్యంగా తాము పని చేస్తున్నామని పునరుద్ఘాటించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్ డిప్యూటీ మేయర్ గుగ్గిళ్లపు రమేశ్, మాజీ ఎమ్మెల్యే సత్యనారాయణగౌడ్, టీఆర్ కార్పొరేటర్లు, నాయకులు వరాల జ్యోతి, పైడిపల్లి రాజు, దూలం సంపత్, కృష్ణారెడ్డి, శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.

336
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles