బాలలపై లైంగిక దాడులను అరికట్టాలి

Tue,November 20, 2018 02:11 AM

తిమ్మాపూర్ నమస్తేతెలంగాణ: సమాజంలో రోజురోజుకూ బాలలపై లైంగిక దాడులు పెరిగిపోతున్నాయనీ, అరికట్టాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉన్నదని సీడీపీఓ, ప్రాంగణం మేనేజర్ సబిత పే ర్కొన్నారు. ఎల్‌ఎండీ కాలనీలోని మహిళా ప్రాం గణంలో బాలలపై అత్యాచార నిర్మూలన దినోత్సవం(నవంబర్19)ను నిర్వహించారు. ఈ సందర్భంగా వృత్తి విద్యాకోర్సుల్లో శిక్షణ పొందుతున్న యువతులకు పిల్లలు, యువతులు, స్త్రీలపై జరుగుతున్న అరాచకాలపై వివరించారు. మహిళల కో సం 181,1091 హెల్ప్‌లైన్ నంబర్లు ద్వారా ఆపత్కాలం సహాయం పొందవచ్చన్నారు. అలాగే చైల్డ్‌లైన్ 1098 జిల్లా కోఆర్డినేటర్ ఆవుల సంపత్ మాట్లాడుతూ.. ఇంట్లో, పాఠశాలలో ఇతర చోట్ల అనేక మంది బాలలు హింస, దారిదోపిడీ, వేధింపుల వంటి రకరకాల ఆకృత్యాల బారిన పడుతున్నారనీ, ఈ నేపథ్యంలోనే వారి హక్కులు గు రించి చైతన్యాన్ని తీసుకురావడానికి ప్రతీ సంవత్సరం నవంబర్19న బాలలపై అత్యాచార నిర్మూలన దినోత్సవం జరుపుతున్నామన్నారు. అలాగే సాంకేతిక మాధ్యమాల్లో ఆడపిల్లలు పడుతున్న మోసాలు, బాల్యవివాహాలు తదితర అంశాలపై వివరించారు. బాలల లైంగిక వేధింపుల నిరోధక చట్టం పోక్సో ఆక్ట్-2012పై అవగాహన కల్పించా రు. అనంతరం బాలలపై జరుగుతున్న లైంగిక దాడులకు వ్యతిరేకంగా కొవ్వొత్తులతో నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో అంగన్‌వాడీజిల్లా ప్రిన్సిపాల్ సు ధారాణి, చైల్డ్‌లైన్ కౌన్సిలర్ సాయి శృతి, సభ్యులు పుష్పలత, పద్మ, భూమేష్, శ్రవణ్, రజ్మియ, వంశీ, తదితరులు పాల్గొన్నారు.

191
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles